• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్యసభ సీటు కోసం కేంద్ర...

రాజ్యసభ సీటు కోసం కేంద్ర మంత్రి ?

| సీనియర్ల నుంచి మొదలెడితే అనేక మంది పెద్దల సభకు వెళ్లాలని చూస్తున్నారు. సీనియర్ల జాబితాలో మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజు ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-27 17:04 GMT

ఏపీలో ముచ్చటగా మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే ఇవన్నీ వైసీపీ గెలుచుకున్నవే. ఆ పార్టీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఆర్ క్రిష్ణయ్యల వల్ల ఏర్పడిన ఖాళీలు ఇవి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయని భావించాలని అంటున్నారు.

ఏపీలో చూస్తే టీడీపీ పుట్టాక రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం మొదటిసారి. అది 2024లో జరిగింది. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు. మొత్తం 11 ఎంపీ సీట్లూ వైసీపీ ఖాతాలోకే వెళ్ళిపోయాయి. అయితే ఇపుడు ఈ మూడు సీట్లు ఖాళీ కావడంతో టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు.

సీనియర్ల నుంచి మొదలెడితే అనేక మంది పెద్దల సభకు వెళ్లాలని చూస్తున్నారు. సీనియర్ల జాబితాలో మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఈ ఇద్దరూ రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. పార్టీకి తాము దశాబ్దాలుగా చేసిన సేవలను గానూ ఇది సముచితమైన గౌరవం అని బావు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అదే విధంగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారుట. మరో మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా తన మైలవరం సీటుని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి త్యాగం చేసినందువల్ల తనకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు.

ఇక 2020 దాకా టీడీపీలో ఉంటూ వైసీపీలోకి వెళ్ళి రాజ్యసభ సీటు అందుకున్న బీద మస్తాన్ రావు తనకు తిరిగి రాజ్యసభకు పంపుతారు అన్న భరోసా మేరకే రాజీనామా చేశారు అని అంటున్నారు. ఇక మూడు సీట్లూ బీసీలకే చెందినవి కావడంతో ఇస్తే బీసీకే ఒకరికి అయినా ఇవ్వాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూడింటిలో జనసేనకు ఒక సీటు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. ఆ సీటుకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ప్రతిపాదించాలని జనసేన నిర్ణయించిందని టాక్ నడుస్తోంది. మిగిలిన రెండు సీట్లలో తమ వారిని రాజ్యసభకు పంపించాలని టీడీపీ భావిస్తోంది.

అయితే సడెన్ గా కేంద్రంలోని బీజేపీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది అని అంటున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరిని ఏపీ కోటాలో రాజ్యసభకు పంపించాలని కేంద్ర పెద్దలు టీడీపీ పెద్దలను కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. పొత్తు పార్టీలు పైగా బీజేపీ పెద్దలు కోరి మరీ అడిగారు కాబట్టి బీజేపీకి ఒక సీటు ఇవ్వడం గ్యారంటీ అని కూడా అంటున్నారు.

దాంతో టీడీపీకి ఒక సీటు మాత్రమే ఉండొచ్చు అని అంటున్నారు. పోటీ తీవ్ర స్థాయిలో ఉన్న వేళ టీడీపీ ఎవరికి ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇంతటి పోటీ నెలకొంటే దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఈ సీటు ఇస్తే ఇక ఎవరూ పోటీకి రారు అన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ బీజేపీ జనసేన మూడు సీట్లను పంచుకోనున్నాయని అంటున్నారు. మరి బీజేపీ నుంచి ఏపీ కోటాలో రాజ్యసభలోకి వెళ్ళే ఆ కేంద్ర మంత్రి ఎవరు అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    
  • Andhrapradesh 
  • Unionminister 
  • MinisterDevineni 
  • Janasena 
  • YanamalaRamakrishna 
  • AshokaGajapatiRaja 
  • Politicalnews 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS