• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్యతో లండన్ కు వెళ్లిన...

భార్యతో లండన్ కు వెళ్లిన ట్రంప్ కు.. ఊహించని చేదు అనుభవం

| భార్య మెలానియాతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్.. బ్రిటన్ రాజు చార్లెస్ అతిథ్యం ఇస్తున్నారు. రాయల్ విండ్సర్ కోటలో వీరు బస చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-09-17 05:34 GMT

పాపం ట్రంప్ అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. అగ్రరాజ్యాధినేతకు అధినేతగా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ.. యూఎస్ ఫస్ట్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అతనికి ఇంటా బయటా వరుస ఎదురుదెబ్బలు తగులుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి చేదు అనుభవం బ్రిటన్ రాజధాని లండన్ లో చోటు చేసుకుంది. భార్య మెలానియాతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ట్రంప్.. బ్రిటన్ రాజు చార్లెస్ అతిథ్యం ఇస్తున్నారు. రాయల్ విండ్సర్ కోటలో వీరు బస చేస్తున్నారు.

సరిగ్గా ఇదే కోట బయట.. ట్రంప్ నకు చేదు అనుభవం ఎదురైంది. ఎందుకుంటే.. ఈ భవనంపైన ట్రంప్ తో కలిసి ఉన్న.. లైంగిక నేరస్థుడైన ఎప్ స్టీన్ పాత ఫోటోను లేజర్ టెక్నాలజీతో ప్రదర్శించారు. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. రాజకీయ నేతలకు వ్యతిరేకంగా వైరల్ స్టంట్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘లెడ్ బై డాంకీస్’ అనే గ్రూపు ఈ సాహసానికి తెగబడినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. లేజర్ సాయంతో ప్రదర్శించిన ఫోటోను.. వీడియోను అధికారులు అడ్డుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకకు నిరసనగానే ఈ పని చేసినట్లుగా చెబుతున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో ట్రంప్ నకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 1990-2000 మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. ఎప్ స్టీన్ తనకు తెలుసన్న విషయాన్ని ట్రంప్ సైతం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

తనకు పదిహేనేళ్లుగా ఎప్ స్టీన్ తెలుసని.. అతనో అద్భుతమైన వ్యక్తిగా పేర్కొంటూ.. అతను తన మాదిరే అందమైన యువతులు.. బాలికల్ని ఇష్టపడతారని పేర్కొనటం తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో ఎప్ స్టీన్ కు ట్రంప్ తో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి అతడితో సంబంధాలు తెంచుకున్నట్లుగా ఈమధ్యనే ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాను కుదిపేసిన సెక్సు కుంభకోణంలో ఎప్ స్టీన్ ను 2019లో అరెస్టు చేశారు. అదే ఏడాది జైల్లో అతను అనుమానాస్పద రీతిలో మరణించటం సంచలనంగా మారింది. ఏమైనా.. భార్యతో కలిసి బ్రిటన్ రాజుగారు అతిథ్యం అందించే కోటలోనే ట్రంప్ నకు ఈ తరహా అనుభవం ఎదురుకావటం ఆయనో షాక్ గా పేర్కొంటున్నారు.

Tags:    
  • TrumpInLondon 
  • EpsteinControversy 
  • TrumpProtest 
  • WindsorCastle 
  • ట్రంప్ లండన్ పర్యటన 
  • విండ్సర్ కోట నిరసన 
  • ఎప్‌స్టీన్ ఫోటో 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS