• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యుద్ధాన్ని అంతరిక్షానికి...

యుద్ధాన్ని అంతరిక్షానికి తీసుకెళ్లనుంది... ఏమిటీ 'గోల్డెన్ డోమ్'?

| అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. గోల్డెన్ డోమ్ గా చెబుతోన్న ఈ రక్షణ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించలేదు.. ఏ అణ్వాయుధమూ సమీపించలేదు!

By - Tupaki Desk
Update: 2025-05-22 09:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఓ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ.15 లక్షల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ గోల్డెన్ డోమ్ గురించిన చర్య విపరీతంగా నడుస్తోంది!

అవును... అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. గోల్డెన్ డోమ్ గా చెబుతోన్న ఈ రక్షణ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించలేదు.. ఏ అణ్వాయుధమూ సమీపించలేదు! ఇది భూమిపైనే కాదు, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచి రక్షణ కల్పించే వ్యవస్థ.

దీని నిర్మాణానికి ప్రస్తుతం $ 25 బిలియన్లు కేటాయించగా.. మొత్తం నిర్మాణానికి $ 175 బిలియన్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన జనరల్ మైఖేల్ గుట్లిన్ పర్యవేక్షించనున్నారు. ఈ డోమ్ నిర్మాణం తన పదవీకాలం (2029) ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి 20 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం చేయడం వెనుక రష్యా, చైనా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాలను ఎదుర్కొనే ఉద్దేశ్యమే ఉందని అంటున్నారు! ప్రస్తుతం ఈ రెండు దేశాలు అత్యాధునిక క్షిపణులను రూపొందించాయి. వీటిని పక్కాగా ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని అమెరికా రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే... ఈ గోల్డెన్ డొమ్ ప్రాజెక్టును చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా.. ఈ వ్యవస్థ తీవ్రస్థాయిలో అస్థిరత సృష్టిస్తుందని, అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఈ రెండు దేశాలు పేర్కొంటున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ డోమ్ విషయం పుతిన్ కు ఇంకా చెప్పలేదని.. సరైన సమయంలో చెబుతానని చెప్పడం గమనార్హం!

Tags:    
  • GoldenDome 
  • DonaldTrump 
  • USA 
  • SpaceForce 
  • MissileDefense 
  • USPolitics 
  • WorldSecurity 
  • ChinaVsUSA 
  • RussiaTensions 
  • Trump2025 
  • DefenseTech 
  • IronDomeInspired 
  • GlobalThreats 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS