• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రష్యాతో ఎవడు...

రష్యాతో ఎవడు పెట్టుకోమన్నాడు? ఉక్రెయిన్ నే తలంటిన ట్రంప్

| రష్యా అధినేత పుతిన్ తో తనకు ఉన్న సంబంధాల రీత్యా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.

By - Tupaki Desk
Update: 2025-02-19 20:30 GMT

సరిగ్గా మూడేళ్ల కిందట.. 2022 ఫిబ్రవరి 24న ప్రపంచమంతటా ఒకటే హడావుడి.. కారణంగా ఉక్రెయిన్ పై రష్యా దాడిచేయడం. అమెరికా అప్పటి అధ్యక్షుడు బైడెన్ సహా వెస్ట్రన్ కంట్రీస్ అధినేతలు ఎంతగా ఉరిమినా.. ఇప్పటికీ రష్యాను ఏమీ చేయలేకపోయారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు. తాను గనుక ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే అసలు రష్యా-అమెరికా యుద్ధమే జరగకపోయేదని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. రష్యా అధినేత పుతిన్ తో తనకు ఉన్న సంబంధాల రీత్యా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ, వాస్తవంలో చూస్తే ఆయన చెప్పేది సరైనదే.

ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం అనేది సాధ్యం కాదని మొన్న కుండబద్దలు కొట్టిన ట్రంప్.. నేడు అసలు రష్యాతో యుద్ధానికి ఎవరు వెళ్లమన్నారంటూ ఉక్రెయిన్ ను తప్పుబట్టారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని కూడా నిందించారు. యుద్ధానికి ముందే రష్యాతో ఒప్పందం చేసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని తన భవనంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ

ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సౌదీ అరేబియాలో మంగళవారం నుంచి మొదలైన శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ను భాగస్వామ్యం చేయలేదు. రష్యా –అమెరికా మంత్రుల స్థాయిలో జరుగుతున్న ఈ చర్చలకు ఉక్రెయిన్ ను పిలకపోవడంపై వస్తున్న విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు.

‘యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని భావిస్తున్నా. ఇప్పటివరకు అంతా సజావుగానే జరుగుతోంది’’ అని చెప్పారు. మూడేళ్లుగా యుద్ధాన్ని ముగించకుండా ఏం చేస్తున్నావ్ ? అని జెలెస్కీని ఉద్దేశించి విమర్శించారు. అసలు మొదలుపెట్టి ఉండాల్సింది కాదన్నారు. ఏదో ఒక ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ కోసం ఒప్పందం కుదర్చుతానని.. అది పోగొట్టుకొన్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలనని ట్రంప్ అన్నారు. ప్రజలు ఎవరూ చనిపోరని.. ఏ నగరమూ నేలమట్టం కావాల్సిన అవసరం రాదని వివరించారు. కానీ, వారు అలా జరగకూడదనుకొన్నారని ట్రంప్ జెలెన్‌ స్కీని ఉద్దేశించి అన్నారు. జెలెన్ స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్‌ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. ఉక్రెయిన్ లో ఎన్నికలు నిర్వహించాలని.. జెలెన్‌ స్కీకి 4 శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నెలాఖరులో తాను పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని, వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటోందని.. ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని ట్రంప్‌ వెల్లడించారు. ము దీనిని ముగించాలనుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్‌ అభివర్ణించారు.

Tags:    
  • DonaldTrump 
  • Ukraineconflict 
  • RussiaUkrainewar 
  • NATOmembership 
  • VolodymyrZelensky 
  • Peacenegotiations 
  • USforeignpolicy 
  • SaudiArabiapeacetalks 
  • VladimirPutin 
  • USRussiaRelations 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS