ఒక ఓటు షర్మిలకు...ఒక ఓటు సైకిల్ కి.. పచ్చ పార్టీ !

ఇదిలా ఉంటే కడప ఎంపీ సీటుకు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా కనీసం ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయలేదు.

Update: 2024-05-07 12:15 GMT

ఇదేమిటి ఈ లెక్క ఏమిటి అనుకుంటున్నారా. అసలు ఏమీ షాక్ తినవద్దు. ఆశ్చర్యమూ పోవద్దు. ఇది ఫక్తు రాజకీయం. ఆ కోణం నుంచి చూస్తేనే అంతా అర్ధం అవుతుంది. అందువల్ల ఈ రకమైన రాజకీయ బేరాలు గతంలోనూ జరిగాయి. ఇపుడూ జరుగుతున్నాయి. ఇందులో వింత కొత్త ఏమీ లేదు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కడప ఎంపీ సీటుకు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా కనీసం ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయలేదు. పైగా బలమైన పార్టీ నుంచి పోటీ చేయలేదు. అలాంటి షర్మిల ఏకాఎకీన ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు అంటే ఆమెకు ఎంతో కొంత దన్ను ఉండాలి కదా. అన్ని లెక్కలూ సరి చూసుకుని కదా ఆమె బరిలోకి దిగుతారు.

మరి ఆ రకంగా చూస్తే కనుక షర్మిలకు బ్యాక్ బోన్ గా టీడీపీ ఉందని ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది. దానిని షర్మిల ఖండిస్తున్నా ఆమె టీడీపీని పెద్దగా ఎక్కడా విమర్శించడం లేదు. దాంతో ఆమె పచ్చ పార్టీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు అని అంటున్నారు. అదే టైం లో ఆమె కడప ఎంపీగా నిలబడడం వెనక టీడీపీ బిగ్ స్కెచ్ ఉందని కూడా అంటున్నారు.

టీడీపీ కడప సీటుని నలభైఏళ్ళ క్రితం అంటే 1984లో మాత్రమే గెలిచింది. మళ్ళీ ఆ పార్టీ గెలవలేదు. దాంతో ఈసారి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా గెలిచాను అనిపించుకోవాలి, పైగా వైసీపీని అక్కడ దెబ్బ కొట్టాలీ అంటే ఇదే సరైన అదనుగా ఆ పార్టీ భావిస్తోంది. అందుకే కడపలో ఈ రకమైన ప్రచారం సాగుతోంది.

Read more!

ఒక విధంగా చెప్పాలంటే కడపలో ఈసారి విచిత్రంగానే ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు. వైఎస్సార్ వారసురాలిని అసలైన వారసత్వం నాదే అని వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్ధిగా షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఇక వైఎస్సార్ వారసుడిగా జగన్ మరో వైపు ఉన్నారు. వైఎస్సార్ వారసుడిగా జగన్ ఆల్ రెడీ ప్రూవ్ అయి ఉన్నారని వైసీపీ అంటోంది.

ఇదిలా ఉంటే వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు తీవ్ర విభేదాల మధ్య టీడీపీకి కడపలో ఆశలు పెరుగుతున్నాయి. వైసీపీ కంచుకోటను తొలిసారి దెబ్బ కొట్టబోతున్నామన్న ఆనందం కూడా వారిలో కలుగుతోంది అని అంటున్నారు. అదెలా అంటే కడప ఎంపీ సీటుకు ఎపుడూ టీడీపీ బలమైన అభ్యర్ధిని నిలబెడుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం సీనియర్ నేతలను పక్కన పెట్టేసి ఒక జూనియర్ క్యాండిడేట్ ని అక్కడ పోటీకి పెట్టింది.

అదంతా ఇండైరెక్ట్ గా షర్మిల కోసం వేసిన స్ట్రాటజీ అని అంటున్నారు. కడపలో టీడీపీ డైరెక్ట్ గా గట్టి ఫైట్ ఇచ్చినా ఎటూ గెలిచే అవకాశాలు లేవు అని అంటున్నారు. అదే టైం లో షర్మిలకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఆమె గెలిస్తే అది తన గెలుపుగా చెప్పుకునే ఫ్యూచర్ పాలిటిక్స్ కి పచ్చ పార్టీ ఈ విధంగా తెర తీసింది అని అంటున్నారు.

దీంతో ఇప్పటికే టీడీపీ క్యాడర్ కి ఒక కీలకమైన సందేశం వెళ్ళిపోయింది అని ఒక ప్రచారం జరుగుతుంది అని అంటున్నారు. కడప ఎంపీ సీటుకు వైఎస్ షర్మిలకు పులివెందులతో పాటు మిగిలిన ఆరు అసెంబ్లీలకు పోటీ చేసే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు సైకిల్ గుర్తుకు వేయాలని సూచనలు వచ్చాయని అంటున్నారు. అంటే కడప టీడీపీ తమ్ముళ్ళకు ఈసారి ఒక విచిత్రమైన అనుభవం అన్న మాట.

4

కరడు కట్టిన టీడీపీ తమ్ముళ్ళు ఈసారి మనసు చంపుకుని టీడీపీ అధినాయకత్వం స్ట్రాటజీలో భాగంగా ఫస్ట్ టైం హస్తం గుర్తుకు కడప ఎంపీ సీటుకు ఓటు వేయాలన్న మాట. మరి దీనిని ఎంత మంది డైజెస్ట్ చేసుకుంటారో ఎంత మంది ఈ విధంగా క్రాస్ చేస్తారో తెలియదు కానీ అదే కనుక నిజంగా జరిగితే షర్మిల గెలుస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే 2019లో చూసుకున్నా టీడీపీకి వైసీపీకి ఓట్ల తేడా మూడున్నర లక్షలకు పైగా ఉంది.

ఇక వైసీపీ ఓట్లను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా వైఎస్ షర్మిల ఎంతో కొంత చీల్చినా కూడా ఆమెకు పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అన్నది డౌట్. అలా మొత్తానికి మొత్తం జరిగితే టీడీపీ ఎంపీ అభ్యర్ధి డిపాజిట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా సగానికి సగం జరిగితే ఈ ఇద్దరూ గెలుపునకు ఆమడ దూరం లో ఉంటారు. కానీ డిపాజిట్లు మాత్రం దక్కుతాయి.

అయితే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డి కి మాత్రం మెజారిటీ బాగా తగ్గించ కలుగుతారు. అదే విజయం అనుకుంటే ఏమీ చేసేది లేదు కానీ టీడీపీ వ్యూహం అంతకు మించి అంటే అవినాష్ రెడ్డిని ఓడించాలి అంటే మాత్రం షర్మిల వైపు నుంచే అధిక శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వైసీపీ వైపు నుంచి కూడా ఎమ్మెల్యేకు ఒక ఓటు ఎంపీ కి ఒక ఓటు అని క్రాస్ చేయాల్సి ఉంటుంది.

ఇపుడున్న పరిస్థితుల్లో వైసీపీ వారు అంతా షర్మిలను చంద్రబాబు తో జట్టు కట్టిన నేతగానే చూస్తున్నారు. కడపలో పార్టీల కంటే కూడా మిగిలిన వ్యక్తిగత విభేదాలు ఎక్కువ. దాంతో వైసీపీ నుంచి ఓట్ల చీలిక ఉండదు అని నూరు శాతం కొట్టి వేయలేరు కానీ ఎంతో కొంత ఉన్నా అది పులివెందుల వరకూ మాత్రమే పరిమితం అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. అదే జరిగితే కనుక షర్మిల ఆశలు నీరుకారే ప్రమాదం ఉంది అంటున్నారు. పచ్చ పార్టీ ఈ విధంగా తెగించి క్రాస్ ఓటింగ్ చేస్తే వైసీపీ మరింతగా పట్టు బిగించడం ఖాయం అదే జరిగితే కడప ఎంపీ సీటు విషయంలో సంచలన ఫలితాలు కూడా వెలుగు చూస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News