పిఠాపురం వర్మకే...మిత్రుల సీట్లలో టీడీపీ మాస్టర్ ప్లాన్

తెలుగుదేశం పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగల క్యాడర్ ని కలిగి ఉంది. ఆ పార్టీది నాలుగు దశాబ్దాల పై దాటిన చరిత్ర.;

Update: 2025-07-09 11:57 GMT

తెలుగుదేశం పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగల క్యాడర్ ని కలిగి ఉంది. ఆ పార్టీది నాలుగు దశాబ్దాల పై దాటిన చరిత్ర. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీకి మంచి బలం ఉంది. క్యాడర్ బేస్డ్ పార్టీగా ఇన్నేళ్ళలోనూ టీడీపీ పటిష్టంగా ఉంది. అటువంటి టీడీపీ పొత్తుల పేరుతో కొన్ని సీట్లు త్యాగం చేయడం అంటే కష్టమే. అయితే పై స్థాయిలో అధికారం దక్కాలీ అంటే కొన్ని ఇలాంటివి తప్పవు.

అంత మాత్రం చేత పొత్తులో పోటీ చేసి మిత్రులు గెలిచిన సీట్లలో టీడీపీ వదులుకోవడం అన్నది ఉండదు కదా. పైగా బలమైన క్యాడర్ ఉన్న చోట టీడీపీ పార్టీని అలక్ష్యం చేసే ఆలోచనలో అసలే లేదని అంటున్నారు. రాజకీయాల్లో పొత్తులు అన్నవి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు పార్టీకి అన్ని చోట్లా బలం ఉండాలి, బలగం ఉండాలి, రేపటి రోజున ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేసినా క్యాడర్ నుంచి మంచి రియాక్షన్ రావాలి. అంతా సహకరించాలి అంటే తమ పార్టీని ఎలాంటి రాజీలూ పేచీలు లేకుండా డెవలప్ చేసుకోవాల్సిందే అన్నది టీడీపీ ఆలోచన.

అందుకే మిత్రులు గెలిచిన సీట్లలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా బలమైన వారిని సమర్ధులను ఎంపిక చేసుకుని మరీ ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా చేయడం మీద టీడీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇంచార్జి బాధ్యతలను వర్మకే తిరిగి అప్పగించారు. ఆయన పార్టీ కోసం పాతికేళ్ళుగా కష్టపడుతూ వస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా మంచి మెజారిటీతో గెలిచి వచ్చారు.

ఈసారి పొత్తులో ఈ సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వెళ్ళిపోయింది. అయినా సరే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ని భారీ మెజారిటీతో గెలిపించే విషయంలో వర్మ చాలా కష్టపడ్డారు. ఇక వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు ఆయనను పిలిచి మాట్లాడారు అని అంటున్నారు. తగిన న్యాయం చేస్తామని చెప్పి మరీ ఇంచార్జి పదవిని ఆయనకే ఇచ్చారని అంటున్నారు.

దాంతో పిఠాపురంలో టీడీపీ సైకిల్ ని పరుగులు పెట్టించే పనిలో వర్మ కచ్చితంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. అక్కడ జనసేన పటిష్టం అవుదామని చూస్తోంది. ఎందుకంటే ఏకంగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దాంతో ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా జనసేన దూకుడు చేస్తోంది.

మరో వైపు టీడీపీ తన బలం కోల్పోకుండా వర్మ అన్ని విధాలుగా పరిశ్రమించి కాసుకొస్తున్నారు. ఒక దశలో జనసేన వర్సెస్ వర్మ అన్నట్లుగా కూడా పిఠాపురం పొలిటికల్ స్టోరీ సాగింది. అయినా సరే ఇపుడు ఏరి కోరి వర్మను ఇంచార్జిగా తిరిగి నియమించడం అంటే మిత్రుల విషయంలో రాజకీయం రాజకీయమే అన్నట్లుగా టీడీపీ స్టాండ్ ఉందని అంటున్నారు.

ఇక జనసేన 21, బీజేపీ 8 సీట్లలో గెలిచాయి. దాంతో ఈ 29 చోట్ల బలమైన నాయకులను ఇంచార్జిగా నియమిస్తునారు. ఇక్కడ క్యాడర్ కి జోష్ తెచ్చేలా ఉత్సాహవంతులైన ఇంచార్జిలను నియమించాలన్నది టీడీపీ ఆలోచన. ఆ విధగ్నా ఇదే వరసలో చూస్తే కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంతలక్ష్మి ఇంచార్జిగా ఉన్నారు. సహాయ సమన్వయకర్తగా కటకంశెట్టి బాబీ ఉన్నారు. పిల్లి అనంతలక్ష్మి మీద పార్టీలో అసంతృప్తి ఉండడంతో బాబీకే ఈ ఇంచార్జి పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు.

అలాగే అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ కి బాధ్యతలు అప్పగించనున్నారు అంటున్నారు. అలాగే రాజోలు ఇంచార్జిగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమకు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, తిరుపతికి సుగుణమ్మ, అవనిగడ్డకు బొబ్బా గోవర్ధనలను నియమిస్తారు అని అంటున్నారు. ఇంతే కాకుండా మిత్రులు ఉన్న మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా బలమైన ఇంచార్జిలను నియమించాలని పార్టీ ఆలోచిస్తోందిట. మొత్తానికి మిత్రులకు విడిచిపెట్టిన సీట్లు వారు గెలిచిన చోట్ల కూడా సైకిల్ జోరు చేసేలా మాస్టర్ ప్లాన్ తో అధినాయకత్వం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News