ఆలస్యంగా వెలుగులోకి.. మహానాడకు వెళుతుంటే చంపేశారు
గతానికి భిన్నంగా పార్టీకి అండగా నిలిచే కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు ఆసక్తికర సమస్యలు కొన్ని.. షాకిచ్చే అంశాలు మరికొన్ని వస్తున్నాయి.;
గతానికి భిన్నంగా పార్టీకి అండగా నిలిచే కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు ఆసక్తికర సమస్యలు కొన్ని.. షాకిచ్చే అంశాలు మరికొన్ని వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన మహానాడుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేసిన వైనాన్ని.. కుటుంబ సభ్యులు తెలుగుదేవం పార్టీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో వినపతిపత్రం అందించటంతో అక్కడి నేతలు సైతం షాక్ తిన్న పరిస్థితి.
వైఎస్సార్ కడప జిల్లాలోని వీరపునాయునిపల్లెకు చెందిన కమలమ్మ తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యకర్త అయిన తన కుటుంబ సభ్యుడ్నివైసీపీకి చెందిన వారు అత్యంత దారుణంగా చంపేశారని.. నిందితులపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడుతున్నట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి మహానాడుకు వెళుతున్న టీడీపీ కార్యకర్తను హతమార్చిన వైనం ఎక్కడా రిపోర్టు కాలేదు.
అందుకు భిన్నంగా కడప జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన కమలమ్మ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తమకు చెందిన టీడీపీ కార్యకర్తను వైసీపీకి చెందిన వారు దారుణంగా హత్య చేశారని.. తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వినపతిపత్రాన్ని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి.. ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు స్వీకరించారు. వెంటనే.. అధికారుల నుంచి వివరణ కోసం పంపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి పలువురు టీడీపీ కార్యకర్తలు ఏపీ వ్యాప్తంగా వచ్చి.. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన వినతిపత్రాల్ని అందజేశారు.