షర్మిలకు అసలైన ప్రత్యర్థిగా ఆమె !
రాజకీయలలోనే ఉంటారు. వారు ప్రత్యర్థులుగా బయట ఉంటారు. సొంత పార్టీలో కనిపించని విధంగా ఉంటారు.;
రాజకీయలలోనే ఉంటారు. వారు ప్రత్యర్థులుగా బయట ఉంటారు. సొంత పార్టీలో కనిపించని విధంగా ఉంటారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎంతో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందువల్ల ఎవరైనా ఎవరి మీద అయినా బాహాటంగానే విమర్శలు చేసుకోవచ్చు.
ఆ విధంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అయితే షర్మిల మీదనే కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఆమె పీసీసీ చీఫ్ అయిన తర్వాత చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానూ ఎత్తిగిల్లలేదని కూడా విశ్లేషించారు.
దానికి షర్మిల సొంత అజెండా కారణం అని కూడా చెప్పారని ప్రచారంలో ఉంది. లేటెస్ట్ గా చూస్తే షర్మిల సొంత జిల్లా కడపలో సుంకర పద్మశ్రీ ఆమె వ్యతిరేక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతోందని విమర్శించారని చెబుతున్నారు.
అంతే కాదు ఆమె తన సొంత అన్న జగన్ మీదనే విమర్శలు చేస్తూ పార్టీని గాలికి వదిలేస్తున్నారు అని కూడా అన్నారు. ఇలాగైతే పార్టీ బతికి బట్ట కష్టమని కూడా ఆమె తేల్చేశారు. ఇక షర్మిలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులతో పద్మశ్రీ సడెన్ గా ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు అన్నది అర్ధం కావడం లేదు. అయితే ఆమె ఒక వ్యూహం ప్రకారమే ఇలా చేసారు అని అంటున్నారు.
ఇలా ఆమె ఉద్దేశ్యపూర్వకంగా షర్మిల వ్యతిరేకులను చేరదీస్తున్నారు అని అంటున్నారు. సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ లో సీనియర్ నేత. షర్మిల కంటే ముందు నుంచి ఆమె పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమెకు కాకుండా షర్మిలకు పీసీసీ చీఫ్ దక్కింది అంటే ఆ సమయంలో జగన్ ఏపీ సీఎం గా ఉండడంతో ఆయన మీదకు టార్గెట్ చేస్తూ ఈ పదవి ఇచ్చారని చర్చ సాగింది. అలాగే దివంగత మహా నేత వైఎస్సార్ తనయ కావడం ఆ రాజకీయ కుటుంబ నేపధ్యం ఆమెకు కీలక స్థానం దక్కేలా చేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక చాలా మంది సీనియర్ నేతలు ఆమెకు సహకరించడం లేదు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో పార్టీ సాగుతున్న పోకడల మీద పద్మశ్రీ లాంటి వారు బాహాటంగానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. వారి మీద క్రమశిక్షణా చర్యలను తీసుకోమని షర్మిల గతంలో హైకమాండ్ కి ఒకసారి ఫిర్యాదు చేశారు అని కూడా ప్రచారం సాగింది.
అయితే ఆ రకమైన యాక్షన్ ఏదీ ఇప్పటిదాక జరగలేదని అంటున్నారు. ఇపుడు పద్మశ్రీ మరోసారి షర్మిలను గురి పెట్టడంతో ఏమి జరుగుతుంది అన్న చర్చ సాగుతోంది. అయితే ఈసారి షర్మిల ఏ మాత్రం ఉపేక్షించరని పద్మశ్రీ విషయంలో సీరియస్ గానే ఉంటారని అంటున్నారు. మరోసారి ఢిల్లీ వెళ్ళి పద్మశ్రీ మీద యాక్షన్ ని కోరుతారని అంటున్నారు. మరి అది జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది.
అసలే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు ఇద్దరు మహిళా నేతల మధ్య ఈ విధంగా అండర్ స్టాండింగ్ లేకుండా పోతూంటే కాంగ్రెస్ పెద్దలు ఏమి చేస్తారు అన్నది కూడా పార్టీలో అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ మీద కాంగ్రెస్ హై కమాండ్ కి ఆసక్తి ఏ మాత్రం ఉంది, బలోపేతం చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అన్న దాని మీదనే ఇలాంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.