ఏఐతో నమ్మితే నట్టేట మునిగినట్టే... గూగుల్ సీఈవో ఏం చెప్పారో తెలుసా?

కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)-AIని నమ్మితే నట్టేట మునిగిపోయే ప్రమాదం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హెచ్చరించారు.;

Update: 2025-11-20 03:03 GMT

కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)-AIని నమ్మితే నట్టేట మునిగిపోయే ప్రమాదం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ప్రస్తుత ఏఐ మోడళ్లపై సుందర్ పిచాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మొద్దంటూ యూజర్లకు సూచించారు. ఏఐ కంపెనీలు కూడా పెట్టుబడులు బూమ్ ఏ దశలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ ప్రభావానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. ఈ మేరకు బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై చర్చించారు.

ప్రస్తుత ఐఏ మోడళ్లలో తప్పులు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఇతర టూల్స్ తనూ సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం అవసరమని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ఏఐపైనే ఆధారపడకుండా విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యం అని పేర్కొన్నారు. ‘ఆ కారణంగానే ప్రజలు గూగుల్ సెర్చ్ ను కూడా ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు మేం చాలా కృషి చేస్తాం’ అని ఆయన చెప్పారు. సృజనాత్మక రచన వంటి విషయాల్లో ఏఐ ఉపయోగకరమే అయినా, ఏఐ చెప్పిందంతా నమ్మడం సరికాదని పిచయ్ చెప్పారు.

ఈ రంగంలో అత్యాధునిక ఏఐ సాంకేతికతలో కూడా కొన్ని పొరపాట్లు తప్పవని ఆయన తెలిపారు. ఇటీవల గూగుల్ జెమినీ చాట్బాట్ ఆధారిత ఏఐ మోడ్ ను సెర్చ్ లో ప్రవేశపెట్టింది. వినియోగదారులకు నిపుణులతో మాట్లాడుతున్న అనుభవం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఐఏ పెట్టుబడుల వృద్ధి రోజురోజుకి పెరిగిపోతున్నప్పటికి దానిలో అహేతుకత కూడా కనిపిస్తోందన్నారు. అదేవిధంగా ‘ఏ కంపెనీ కూడా పూర్తిగా సురక్షితం కాదు.. గూగుల్ కూడా’ అని సమాధానమిచ్చారు.

చిప్ల నుంచి యూట్యూబ్ డేటా వరకు మోడళ్ల నుంచి ఫ్రాంటియర్ సైన్స్ వరకు అన్ని సాంకేతిక సెగ్మెంట్లను స్వయంగా కలిగి ఉండటం వల్లే ఏఐ మార్కెట్లో ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే స్థాయిలో గూగుల్ ఉందని పిచాయ్ వ్యాఖ్యానించారు. అలాగే యూకేలో తమ పెట్టుబడులు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో మౌలి సదుపాయాలు, పరిశోధనలపై 5 బిలియన్ పౌండ్లను ఖర్చు చేయనున్నట్లు పిచాయ్ వివరించారు.

Tags:    

Similar News