• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీ పెద్దలతో సుమలత...

బీజేపీ పెద్దలతో సుమలత భేటీ అందుకేనా?

| దివంగత ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అంబరీష్‌ సతీమణి అయిన సుమలత ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యా ఎంపీగా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-09 07:30 GMT

ప్రముఖ సినీ నటి సుమలత.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ లతో భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. దివంగత ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అంబరీష్‌ సతీమణి అయిన సుమలత ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యా ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జనతాదళ్‌ (సెక్యులర్‌) కు మాండ్యా కంచుకోట. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో మాండ్యా నుంచి దేవగౌడ మనుమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన సినీ హీరో నిఖిల్‌ గౌడ బరిలోకి దిగారు. అయితే సుమలత చేతిలో ఓడిపోయారు. బీజేపీ పోటీ చేయకుండా సుమలతకు మద్దతు ఇవ్వడంతో ఆమె సునాయాసంగా విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో ఆమె మరోమారు మాండ్యా నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలను కలిశారని టాక్‌ నడుస్తోంది. అయితే గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన బీజేపీ, జేడీఎస్‌ ఈసారి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఈ క్రమంలో మాండ్యా సీటును పొత్తులో భాగంగా జేడీఎస్‌ కు వదిలేయాల్సి రావొచ్చు. అదే జరిగితే సుమలత మరోసారి ఇండిపెండెంట్‌ గా బరిలోకి దిగినా గెలుపు కష్టమే అవుతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సుమలత.. బీజేపీ పెద్దలను కలిశారని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎంపీగా ఉన్న సుమలత ఇప్పటిదాకా బీజేపీలో చేర లేదు. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాండ్యా సీటు కోసం ఆమె బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు.

బీజేపీ తనకు మాండ్యా సీటును కేటాయిస్తే ఆమె ఆ పార్టీలో చేరడానికి సిద్ధమేనని సుమలత.. జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌ లకు ఆమె తెలిపినట్టు సమాచారం.

వాస్తవానికి గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమలత బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఆ పార్టీలో చేరకుండా తన మద్దతును ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో మాండ్యా సీటును బీజేపీ తరఫున సుమలత ఆశిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఇందుకు ఒప్పుకోకపోతే.. ఆమెకు వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆమెతో టచ్‌ లో ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమలత వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుమలత విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది.

What is your opinion on Yatra 2 movie? #Yatra2 #Yatra2Movie #Yatra2movieReview #Mammootty #Jiiva #Tollywood #Tupaki

— Tupaki (@tupaki_official) February 8, 2024
Tags:    
  • Bjp 
  • Congressparty 
  • Sumalatha 
  • Jpnadda 
  • Santosh 
  • Ambarish 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS