స్కాం సొమ్ములతో 'స్పై' మూవీ పెట్టుబడులు?

ఈడీ ఎంటర్ టైన్స్ మెంట్స్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రానికి కథను సమకూర్చింది రాజ్ కసిరెడ్డి అన్న టైటిల్ కార్డు వేసుకవోటం తెలిసిందే.;

Update: 2025-04-16 08:42 GMT

అతడికి వచ్చిన ఇమేజ్ ను మరింత పెంచుతూ.. పాన్ ఇండియాలో నిర్మించిన ఈ మూవీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యాన్ని కథా వస్తువుగా తీసుకొని నిర్మించిన ఈ మూవీ మీద చాలానే ఆసక్తి వ్యక్తమైంది.

తెలుగు.. హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 29న విడుదలైంది. రిలీజ్ కు ముందున్న బజ్.. మూవీ విడుదలైన తర్వాత లేకపోవటం.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలో విషయంలో ఆశించినంతగా లేకపోవటంతో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిన పరిస్థితి. అయితే.. ఈ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విచారణ సంస్థలు ఈ సినిమా గురించి మాట్లాడుకోవటమే కాదు.. ఈ సినిమా పెట్టుబడుల అంశం మరో కథగా మారింది.

ఈడీ ఎంటర్ టైన్స్ మెంట్స్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రానికి కథను సమకూర్చింది రాజ్ కసిరెడ్డి అన్న టైటిల్ కార్డు వేసుకవోటం తెలిసిందే. ఇక.. ఈ చిత్ర నిర్మాతగా అధికారికంగా ప్రకటించుకున్నారు కూడా. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ టీంలు.. ఇటీవల ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ రిజిస్టర్ చిరుమానకు వెళ్లి.. తనిఖీలు జరిపాయి. మణికొండలోని ప్రశాంతి హిల్స్ లోని నివాసంలో చిత్ర నిర్మాణానికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించటం లేదన్న విషయాన్ని గుర్తించాయి. ఈ చిరునామాలో ఇప్పుడు ఐటీ కంపెనీ ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ కంపెనీకి ఎండీగా రాజ్ కసిరెడ్డి సోదరి మేఘనా ప్రియదర్శిని రెడ్డి.. తల్లి సుజాత రెడ్డిలు డైరెక్టర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థకు ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ కు మధ్య లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్పై మూవీ బడ్జెట్ ఎంత?దానికి చేసిన ఖర్చు ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ మూవీ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు ఎలా చేశారు? ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఎంత? లాంటి అంశాల మీద సిట్ ఫోకస్ చేసింది.

ఈ సినిమాతో పాటు.. రాజ్ కసిరెడ్డి మరెన్ని సినిమాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు? వాటికి ఎంతెంత ఖర్చు చేశారు? వాటికి అవసరమైన నిధులకు ఉన్న అవకాశాలుగా చూపించారు? అన్నది ప్రశ్నగా మారాయి. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం చూస్తే.. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించేందుకు వీలుగా పలువురు యువ దర్శకులు.. రచయితలకూ అడ్వాన్సులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మిడ్ రేంజ్.. కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన నలుగురైదుగురు దర్శకులతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణాలకు ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడీ అంశాల మీద సిట్ అధికారులు ఫోకస్ చేస్తున్నారు.

Tags:    

Similar News