గుండె జబ్బుల ముప్పుకు కారణమేంటో తెలుసా?

జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్ల వెంట నాయిస్ బ్యారియర్లను ఏర్పాటు చేసుకోవాలి.

Update: 2024-04-29 05:15 GMT

ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, రసాయనాల వినియోగం, మన ఆహార అలవాట్లు వెరసి గుండె జబ్బులకు కారణాలుగా నిలుస్తున్నాయి. పూర్వ కాలంలో అయితే ముసలి వయసులో మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్లకే గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటోంది.

నగరాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది. ట్రాఫిక్ ధ్వని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం లాంటి ముప్పు 3.2 శాతం మేర పెరుగుతుంది. రాత్రివేళ ట్రాఫిక్ శబ్ధాలు నిద్రకు అడ్డంకులు కలిగిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరగొచ్చు. దీనివల్ల ఇన్ ఫ్లమేషన్, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు అవకాశం ఏర్పడుతుంది.

జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్ల వెంట నాయిస్ బ్యారియర్లను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో 10 డిసిబల్స్ వరకు ధ్వని తీవ్రత తగ్గుతుంది. వాహనాల వేగాన్ని నియంత్రించాలి. తక్కువ శబ్ధాన్ని ఇచ్చే టైర్ల వినియోగం పెంచాలి. సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలి. ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలి. ధ్వని కాలుష్యాన్ని తగ్గించడం వల్ల మేలు కలుగుతుంది.

ప్రస్తుతం నగర జనాభా విస్తరిస్తోంది. రైళ్లతో ఉత్పన్నమయ్యే ధ్వని కాలుష్యం వల్ల విపరీత శబ్ధం వస్తోంది. వాహనాల వినియోగం పెరగడంతో ధ్వని వేగం కూడా అధికమవుతోంది. దీని వల్ల మనుషుల్లో పలు రోగాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. గుండె జబ్బుల ముప్పు పెరగడానికి ధ్వని పరోక్షంగా కారణంగా నిలుస్తోంది. ధ్వని కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాతావరణ కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం వాహనాల వినియోగంపై నియంత్రణ తీసుకొచ్చింది. వాహనాల వినియోగం వల్ల విచ్చలవిడిగా పెరుగుతున్న పొగ, ధ్వని కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఢిల్లీ మాదిరి మిగతా నగరాలు కూడా కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడానికి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.

Tags:    

Similar News