• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇందిర ఎమర్జెన్సీ మీద ...

ఇందిర ఎమర్జెన్సీ మీద సోనియా షాకింగ్ కామెంట్స్ !

| 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన భారీ ఆందోళనలను ఎదుర్కొనేందుకే ఎమర్జెన్సీ విధించారని, అది రాజ్యాంగబద్ధమైన నిర్ణయమని పేర్కొన్నారు. అయితే దాని ప్రభావం ప్రజాస్వామ్య హక్కులపై పడిందని, అనంతరం ఇందిరాగాంధీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు.

By - Satya P
Update: 2026-11-07 14:09 GMT

అధునిక భారత దేశంలో మరీ ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం వచ్చాక జరిగిన అతి పెద్ద ఉదంతంగా ఎమర్జెన్సీని చరిత్రకారులు పేర్కొంటారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వస్తే 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అంటే 28 ఏళ్ళ తరువాత అన్న మాట. 1950లో రాజ్యాంగం రాసుకుని దాని ప్రకారం స్వేచ్ఛాయుతమైన పాలనను సాగిస్తూ వచ్చిన దేశానికి ఎమర్జెన్సీ అతి పెద్ద కుదుపు. ఎమర్జెన్సీని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విధించారు. ఆమెకు ముందు పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధానులుగా పనిచేశారు. మూడవ ప్రధానిగా వచ్చిన ఇందిరాగాంధీ తన తొమ్మిదేళ్ల ప్రధానమంత్రిత్వంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయంగా దీనిని చెబుతారు. ఎమర్జెన్సీ మీద భిన్న వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ అయితే ఈ రోజుకూ దానికి ఏదో విధంగా సమర్థించుకుంటోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు చీకటి కాలంగా దానిని అభివర్ణిస్తాయి.

కోడలు చెప్పేది ఇదే :

ఇక దేశానికి ఎమర్జెన్సీ విధించే నాటికి ఇందిరాగాంధీ కోడలుగా సోనియా గాంధీ వచ్చి ఏడేళ్ళు అవుతుంది. ఆమె రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ అదే ఢిల్లీలో వేరే చోట నివాసం ఉంటూ పైలెట్ గా జీవించేవారు అని అంటారు. ఇక ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ తల్లి వెంట ఉంటూ రాజకీయంగా ఆనాడు హవా చలాయించేవారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ మీద ఎవరైనా ఆరోపణలు చేయాలి అంటే ముందు ఎమర్జెన్సీ తీసుకుని వస్తారు. అలాంటి ఎమర్జెన్సీ గురించి సోనియా గాంధీ అభిప్రాయం ఎపుడూ వెల్లడి కాలేదు. ఆమె ఈ దేశానికి అతి పురాతమైన కాంగ్రెస్ పార్టీకి రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా అధ్యక్షురాలిగా సేవలు అందించారు. అయితే ఆమె తన జీవితం మొత్తాన్ని ఒక పుస్తకం రూపంలో తెస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని రాజ్యాంగబద్ధంగానే విధించారని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

ఆనాటి పరిస్థితులు :

ఎమర్జెన్సీ ప్రధానిగా ఇందిరాగాంధీ విధించడానికి కారణాలు ఉన్నాయని సోనియా గాంధీ చెప్పుకొచ్చారు. ఆనాటి ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్గనైజ్డ్‌గా చేస్తున్న అతి పెద్ద ఆందోళనలను ఎదుర్కొనేందుకే ఆమె అలా చేశారని సోనియాగాంధీ చెప్పడం విశేషం. అయితే అదే ఎమర్జెన్సీ ఫలితాలు వేరేగా వచ్చాయి అన్నది సోనియా గాంధీ భావనగా ఉంది. ఒక విధంగా ఎమర్జెన్సీ దేశంలోని ప్రజల ప్రజాస్వామ్య హక్కులపైన తీవ్రంగా ప్రభావం చూపిందని ఆమె అన్నారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పట్ల చింతిస్తూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారని సోనియా గాంధీ గుర్తు చేయడం విశేషం.

ఆనాటి పరిస్థితులు ఏంటి :

ఇక సోనియాగాంధీ చెప్పిన ఆనాటి పరిస్థితులు ఏమిటి అన్నది మరోసారి చర్చ సాగుతోంది. ఎందుకు ఇందిరాగాంధీ అంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నది కూడా తర్కించి చూస్తే కనుక చాలా కనిపిస్తాయి. సోనియాగాంధీ అన్నట్లుగా ఎమర్జెన్సీ అన్నది రాజ్యాంగబద్ధమైన చర్యగానే చూస్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో దానికి అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలోని 352 వ అధికరణం ప్రకారం దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అత్యవసర పరిస్థితిని విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. ఈ కోణంలో చూసినప్పుడు ఇది పూర్తిగా రాజ్యాంగ పరిధిలోనే తీసుకోబడిన నిర్ణయం. అయితే అప్పటి పరిస్థితులు విపక్షాల ఆందోళనలు దానికి దారి తీశాయా అన్నది కూడా చర్చగా ఉంది.

రాజకీయ అణచివేత :

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద ఈ రోజుకీ రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారుల మధ్య భిన్నమైన వాదనలు ఉన్నాయి. శాంతిభద్రతల సమస్య కోణంలో దీనిని ఆలోచించినా మరో వైపు విపక్షాల ఆందోళనలను అణచివేత చర్యగానే చూసే దృక్కోణం కూడా ఇందులో ఉంది. అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారి మాటల ప్రకారం చూస్తే అప్పటికి దేశంలో అంతర్గత అశాంతి తీవ్రంగా ఉందని అంటారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌ నేతృత్వంలో సాగిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. దేశవ్యాప్త రైల్వే సమ్మెలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, పోలీసులను, సైన్యాన్ని ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించాల్సిందిగా విపక్షాలు పిలుపు నివ్వడం వంటి చర్యలు దేశాన్ని అరాచకత్వంలోకి నెట్టేలా కనిపించాయని ఎమర్జెన్సీని సమర్ధించే వారు చెబుతారు. అందువల్ల దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి, వ్యవస్థ కుప్పకూలకుండా చూడటానికి ఎమర్జెన్సీ విధించడం మినహా మరో మార్గం లేకపోయిందని వారు వాదిస్తారు.

పదవిని కాపాడుకోవడం కోసమేనా :

ఇక ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అంటూ 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమె ప్రధానమంత్రి పదవికి ముప్పు తెచ్చిందని చెబుతారు. ఇక ఈ రాజకీయ సంక్షోభం నుండి తన పదవిని, అధికారాన్ని కాపాడుకోవడానికే ఆమె అత్యవసర పరిస్థితిని అస్త్రంగా వాడుకున్నారని ప్రతిపక్షాలు తో పాటు ప్రజాస్వామ్య ప్రియులు రాజకీయ విమర్శకులు చెబుతారు. అయితే ఈ ఎమర్జెన్సీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజల మీదకు కూడా దూసుకుని వచ్చింది. అలా రాజ్యాంగబద్ధంగానే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టినప్పటికీ ఆ తర్వాత ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసింది. అంతే కాదు ప్రతిపక్ష నాయకులను వరసబెట్టి జైళ్లలో పెట్టడం పత్రికలపై సెన్సార్‌షిప్ విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అది రాజ్యాంగ నియంతృత్వానికి దారితీసిందని బలమైన వాదన కూడా మరో వైపు ఉంది.

మోడీ హయాంలోనే :

ఇక సోనియాగాంధీ మోడీ ప్రభుత్వం మీద విమర్శలు ఘాటుగానే చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలకూ తీవ్ర నష్టం జరిగిందని ఆమె విమర్శించారు. అంటే కాంగ్రెస్ ఎమర్జెన్సీ కంటే కూడా ఇపుడు ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయని ఆమె చెప్పదలచారా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఎమర్జెన్సీ అన్నది మాత్రం దేశ చరిత్రలో చీకటి అధ్యాయం గానే మెజారిటీ ప్రజలు భావిస్తారు అన్నది నిజం.

Tags:    
  • soniagandhi 
  • indiragandhi 
  • emergency1975 
  • indianpolitics 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS