• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మెరుపులు స‌రే.. మ‌ర‌క‌ల...

మెరుపులు స‌రే.. మ‌ర‌క‌ల మాటేంటి బాబూ.. !

| అయితే.. ఈ మెరుపుల మాటున ప‌డుతున్న మ‌ర‌క‌ల‌ను కూడా సీఎం గ్ర‌హించాల్సి ఉంది.

By - Tupaki Desk
Update: 2024-12-18 14:30 GMT

రాష్ట్రంలో పెట్టుబ‌డుల వ‌ర‌ద పారుతోంద‌ని.. పెద్ద ఎత్తున ఉపాధి ల‌భిస్తుంద‌ని.. సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. మంచిదే.. ఇది కావాల్సిందే కూడా. అంతేకాదు.. విజ‌న్ 2047 అంటూ కూడా హ‌డావుడి చేస్తున్నా రు. ప‌ది సూత్రాల‌తో రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి ప‌థం దిశ‌గా న‌డిపించ‌నున్న‌ట్టు కూడా ఢంకా భ‌జాయిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ప్ర‌గ‌తి దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతు న్నారు. అయితే.. ఈ మెరుపుల మాటున ప‌డుతున్న మ‌ర‌క‌ల‌ను కూడా సీఎం గ్ర‌హించాల్సి ఉంది.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు-అంటూ.. సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా చెబుతుంటారు. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తూనే ఉన్నారు. అది అభివృద్ది కావొచ్చు.. ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌పై ప‌డుతున్న భారాలు కావొచ్చు. అభివృద్ధికంటే కూడా.. ప్ర‌జ‌లు స‌హించ‌లేనిది.. భారాల‌నే. ఈ విష‌య‌మే వైసీపీని పుట్టిముంచింది. ఏడాదికి అమ్మ ఒడి ప‌థ‌కం కింద రూ.15000 ఇచ్చినా.. మ‌హిళా సాధికార‌త పేరుతో బీసీ మ‌హిళ‌ల‌కు రూ.18000 ఇచ్చినా తీసుకున్నారు.

అయితే.. ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల సొమ్మును ఇస్తున్నాం క‌దా.. రూ.100 చెత్త‌ప‌న్ను క‌ట్ట‌లేరా? అని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ భావించారు. క‌డ‌తారులే అనుకున్నారు. కానీ, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వేల కంటే కూడా.. నెల‌కు రూ.100 క‌ట్ట‌డం క‌ష్ట‌మైంది. అది.. ఎన్నిక‌ల స‌మయంలో అంతే ప్ర‌భావం చూపింది. అదేస‌మ యంలో పేద‌ల‌కు ఎక్క‌డెక్క‌డోభూములు ఇచ్చారు. దీనికి కూడా వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసారు. అయితే.. ఇదే స‌మ‌యంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని ఇర‌కాటంలోకి నెట్టింది.

అంటే.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం మంచిదే. కానీ, ఇదే స‌మ‌యంలో స‌ర్కారు బాదుడును కూడా ప్ర‌జ‌లు ఎక్కువ‌గానే ప‌రిగ‌ణిస్తున్నార‌న్న విష‌యం వైసీపీ విష‌యంలో స్ప‌స్ట‌మైంది. ఇప్పుడు కూట‌మికి కూడా ఇదే ప‌రిస్థితి వ‌స్తోంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. బాదుడు ఇప్పుడు మామూలుగా లేదంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఎక్క‌డ ఏ న‌లుగురు కూర్చున్నా.. కూట‌మి స‌ర్కారు బాదుడుపైనే చ‌ర్చ సాగుతోంది. ఆరు మాసాల్లోనే ప్ర‌భుత్వం వ‌సూలు చేస్తున్న అద‌న‌పు బాదుడు లెక్క‌లు జోరుగానే వినిపిస్తున్నాయి. వీటి విష‌యంలో చంద్ర‌బాబు నియంత్ర‌ణ పాటించ‌క‌పోతే.. ఇబ్బంది త‌ప్ప‌దు.

ఇవీ బాదుళ్లు..

+ రెండు పెరిగిన విద్యుత్ చార్జీలు

+ కూర‌గాయ‌ల ధ‌ర‌లు

+ కందిప‌ప్పు కిలో కు రూ.12-15 చొప్పున పెంపు

+ వ‌చ్చే నెల నుంచి రిజిస్ట్రేష‌న్ల బాదుడు

+ ఇప్ప‌టికే పెరిగిన ఇంటి ప‌న్నులు, కుళాయి ప‌న్నులు

+ ప్రైవేటు పాఠ‌శాల‌ల పీజుల నియంత్రణ ఎత్తేయ‌డం

+ ప్ర‌తి ప‌నికీ పెరిగిపోయిన అవినీతి.

Tags:    
  • Chandrababu 
  • YSjagan 
  • Appeople 
  • Andhrapradesh 
  • Appolitics 
  • Apcm 
  • Vision2047 
  • Supersix 
  • Alliancegovernment 
  • Pawankalyan 
  • Janasena 
  • Politicalnews 

Similar News

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

Copyright @2026

Powered by Blink CMS