• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోలవరం ...గోదావరి మీద...

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

| ఏపీకి జీవనాడిగా వర ప్రదాయినిగా ఉన్న పోలవరం డ్యాం నిర్మాణం 2027 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది.

By - Satya P
Update: 2026-11-03 19:30 GMT

ఏపీకి జీవనాడిగా వర ప్రదాయినిగా ఉన్న పోలవరం డ్యాం నిర్మాణం 2027 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. దాని కోసం శరవేగంగా పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికి అయితే 90 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2027 గోదావరి పుష్కరాలకు ముందే ఈ డ్యామ్ పూర్తి అయి ఆంధ్ర జాతికి అంకితం అవుతుంది. ఇంతటి పెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ ని ఎలా నిర్మిస్తున్నారు అన్నది ఎవరికీ ఊహకు కూడా అందదు. నిజానికి ఆ ఆలోచన కూడా ఎవరూ చేయరేమో. అయితే ఆ విషయాలు తెలుసుకుంటే మాత్రం పోలవరం ఒక అద్భుతమైన నిర్మాణం అని అందరికీ కచ్చితంగా బోధపడుతుంది.

అసలు ఎలా సాధ్యం :

గోదావరి అంటేనే అతి పెద్ద జీవనది. అది మహారాష్ట్రలో పుట్టినపుడు చిన్నగా మొదలవుతుంది. కానీ తెలంగాణాను దాటి ఏపీ వైపుగా మళ్ళినపుడు అఖండ గోదావరి అవుతుంది. దాంతో ఉరుకులు పరుగులతో సముద్రం వైపుగా సాగుతుంది. అలాంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ కట్టడం అంటే ఎలా సాధ్యం అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. దాని వెనక ఉన్న ఇంజనీరింగ్ పనితనం గురించి బహుశా అత్యధిక శాతం మందికి తెలియదు. అసలు గోదావరి నది మీద ఈ డ్యామ్ ని ఎలా కడుతున్నారు, ఇది సాధ్యమేనా అంటే ఇక్కడే ఇంజనీరింగ్ అద్భుతమైన పనితనం దాగి ఉంది. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుంటే వామ్మో అనిపించకమానదు. నిజానికి జోరుగా పారుతున్న గోదావరినీటిలో డ్యామ్ కట్టడం అన్నది సాధ్యం కానే కాదు. అందుకే నదిని దారి మళ్ళిస్తారు.

స్పిల్ వే అంటే అదే :

గోదావరి నీరు ప్రవహిస్తుంటే పునాదులు వేసి డ్యామ్ కట్టడం అసాధ్యం కాబట్టే నది నీటిని ప్రక్కకు మళ్ళించడానికి ఒక కృత్రిమ మార్గాన్ని సృష్టించారు. అలా నది పక్కన పొడి నేలలో 48 గేట్లతో అతి పెద్ద కాంక్రీట్ నిర్మాణమే జరిగింది. దాని పేరే స్పిల్ వే. ఆ తరువాత నదికి అడ్డంగా పైన ఒకటి దిగువన ఒకటి రెండు కాఫర్ డ్యాములను వేశారు. ఇలా గోదావరిని తన దారిని మార్చేలా చేసి స్పిల్ వే వైపుగా నదీ ప్రవాహాన్ని మళ్ళించారు అన్న మాట. ఇలా గోదావరి తన దారి అంతా మార్చుకుంటే అలా వదిలేసిన ప్రాంతం అంతా తడి నేలగా మారుతుంది. అలా బయటపడిన నది నేలలో నిర్మాణం చేపట్టడం కూడా చాలా కష్టమైన వ్యవహారంగానే ఉంటుంది. ఎందుకంటే నది నేల కింద అంతా ఇసుకతో నిండి ఉంటుంది కానీ గట్టి రాయి అన్నది కనిపించదు. లోతుల్లో దాకా తడి ఇసుకే ఉంటుంది. ఇక్కడ డ్యామ్ కట్టినా పైన నీళ్ళు ఆగినా ఇసుకలో నుంచి అలా లీక్ అయిపోతాయి.

డయాఫ్రమ్ వాల్ కీలకం :

అందుకే నది ఇసుక తిన్నెల కింద నీరు ఊరటం లేదా లీకేజీ అవ్వడం జరగకుండా ఉండటానికి నది గర్భంలో 40 నుండి 95 మీటర్ల లోతు వరకు కాంక్రీట్‌తో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇలా ట్రెంచ్ కట్టర్ అనే మిషన్ నుంచి రాయి తగిలేంతవరకూ లోతుల వరకూ ఒక గుంత తవ్వుతారు. అది కూలిపోకుండా బురదతో నింపి ఆ తరువాత కాంక్రీట్ పోస్తారు. నది గర్భంలోని ఇసుకను భారీ యంత్రాలతో గట్టిగా పటిష్టం చేసి అక్కడ భూమిని పటిష్టంగా మారుస్తారు. ఈ పటిష్టమైన గోడనే డయాఫ్రమ్ వాల్ అని పిలుస్తారు. దానిని పునాది అనుకుంటే కొన్ని లక్షల టన్నుల బరువైన బంకమట్టి పెద్ద పెద్ద రాళ్లను దాని మీద పొరలు పొరలుగా వేస్తూ రోలర్లతో తొక్కిస్తూ 50 మీటర్ల ఎత్తు వరకూ తీసుకుని వస్తారు. అలా ప్రధానమైన డ్యామ్‌ను నిర్మిస్తున్నారు అన్న మాట.

భారీ వరదలు వచ్చినా :

ఇక చూస్తే 2020 వరదలలో పైన ఉన్న కాఫర్ డ్యామ్‌ కొట్టుకుని పోయి పాత గోడ పూర్తిగా దెబ్బ తింది. అందుకే కొత్త గోడను మళ్ళీ కట్టాల్సి వచ్చింది అని జలవనరుల శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇలా పటిష్టంగా నిర్మించిన ఆ డయాఫ్రమ్ వాల్ మీదనే అసలు డ్యామ్ కడుతున్నారు అన్న మాట. ఇక ఈ మధ్యలో ఉన్న మట్టి నీళ్ళను ఆపుతుంది. ఇక దాని చుట్టూ ఇసుక మధ్యలో రాళ్ళు ఉంటాయి. ఇక ట్రక్కులు పోసి రోలర్లు తొక్కుతూ పొర మీద పొరని అలా వేసుకుంటూ అత్యంత పటిష్టం చేస్తాయి. ఇంతలా సాగిన ఈ నిర్మాణంలో పెద్ద వరదలు వస్తే ఏమిటి సంగతి అన్నది కూడా ఉంటుంది కదా. హైడ్రాలిక్ సిలిండర్లు గేట్లను అత్యవసర సమయంలో ఒక్కసారిగా పైకి లాగుతాయి. దాంతో వరద నీళ్ళు డ్యామ్ ని తాకకుండా స్పిల్ వే ద్వారా బయటకు పోతాయి. ఇక ఆగిన నీళ్ళు అయితే కుడి కాలువ నుంచి విజయవాడ వైపు ఎడమ కాలువ నుంచి విశాఖ వైపుగా పరుగులు తీస్తాయి. ఇక ఇక్కడే విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తారు. చెబుతూంటేనే ఎంతో ఆసక్తిని పెంచే పోలవరం నిర్మాణం అయితే ఒక యజ్ఞం అన్న మాట. పోలవరం దాదాపుగా తొంబై ఏళ్ళ కల. ఇన్నేళ్ళకు అది సాకారం కాబోతోంది అంటే దానిని చూస్తున్న ఈ తరం చాలా అదృష్టం. ప్రయోజనం పొందే భావి తరాలు కూడా ధన్యం అని చెప్పాల్సిందే.

Tags:    
  • polavaramproject 
  • polavaramdam 
  • andhrapradesh 
  • godavaririver 
  • civilengineering 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS