పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?
| ఏపీలో ఈ నెల 5న జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారం ముగిసింది.
ఏపీలో ఈ నెల 5న జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారం ముగిసింది. ఏపీలో ఆరు వందలకు పై చిలుకు జెడ్పీటీసీ అలాగే వేలాది ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీలో మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇందులో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలు మొత్తం 9,829 ఉంటే అందులో 1,985 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 7,844 స్థానాలకు ఎన్నికల పోరు జరగనుంది.
మునిసిపోల్స్ ప్రభావం :
రెండు రోజుల వ్యవధిలో పరిషత్తు ఎన్నికలు జరుగుతాయి అనగా కార్పోరేషన్ మునిసిపాలిటీల రిజల్ట్స్ వచ్చాయి. అన్నింటా కూటమి స్వీప్ చేసేసింది. వైసీపీకి పెద్దగా సీన్ లేదని ఈ ఫలితాలు తేల్చేశాయి. ఇపుడు పరిషత్తు ఎన్నికలు ఉన్నాయి. నిజానికి రూరల్ బేస్డ్ గా జరిగే ఈ ఎన్నికల మీద వైసీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో వైసీపీకి బలం ఉందని తమ ఓటర్లు ఎక్కువగా రూరల్ సెక్టార్ లోనే ఉన్నారు అని వైసీపీ నేతలు చెబుతారు. అయితే లేటెస్ట్ గా అర్బన్ బాడీస్ కి వచ్చిన ఫలితాలు రూరల్ లో కూడా ప్రభావం గట్టిగా చూపుతాయని అంటున్నారు. పైగా కూటమి పటిష్టంగా ఉందని తేలిపోయింది. అంతే కాదు స్థానిక ఎన్నికల్లో జనం మూడ్ అర్బన్ రూరల్ అన్న తేడా లేకుండా ఒకే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక అధికారంలో ఉన్న పార్టీకే జనాలు మద్దతు ఇస్తారు. అలా ఇవన్నీ చూసుకుంటే కచ్చితంగా అర్బన్ రిజల్ట్ రూరల్ లో రిపీట్ అవుతుందని అంటున్నారు.
వైసీపీ ఆశలు :
అయితే దీనిని వైసీపీ పూర్తిగా అంగీకరించడం లేదని అంటున్నారు. రూరల్ లో సీన్ వేరేగా ఉంటుందని చెబుతున్నారు. తాము మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. మరీ గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళి జనం నాడిని పట్టుకునే ఈ ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయని ఆ పార్టీ అంటోంది. అదే విధంగా చూస్తే వేలాది ఎంపీటీసీలు ఉన్నాయి. దాంతో ఓటర్లు తక్కువ ఉంటారు, అలాంటి వేళ సింగిల్ డిజిట్ తోనే రిజల్ట్ తారు మారు అవుతుందని అంటున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే కూటమిలో కో ఆర్డినేషన్ కి కూడా అది పరీక్ష గా మారుతుందని అంటున్నారు. ఇలా వైసీపీ ఆలోచనలు ఉంటే ఏపీ మొత్తం ఒక యూనిట్ గానే ఉంటుందని ఈ తేడాలు కనిపించవని ఒకే ఫలితం ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఉంటుందని రేపటి పరిషత్తు ఎన్నికల్లో అదే జరిగి తీరుతుందని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.