• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అతి పెద్ద కార్పోరేషన్ కి...

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

| ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా విశాఖ ఉంది. మొత్తం 120 వార్డులతో జీవీఎంసీ ఉంది. దేశంలో టాప్ టెన్ కార్పొరేషన్లలో ఓటి విశాఖ.

By - Satya P
Update: 2026-11-03 18:24 GMT

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా విశాఖ ఉంది. మొత్తం 120 వార్డులతో జీవీఎంసీ ఉంది. దేశంలో టాప్ టెన్ కార్పొరేషన్లలో ఓటి విశాఖ. దాదాపుగా అయిదు వేల కోట్ల వార్షిక బడ్జెట్ తో బృహత్ కార్పొరేషన్ గా ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీ, ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు ప్రధమ పౌరురాలిగా మేయర్ గా నిలిచి గెలిచిన ఘనత టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి దక్కించుకున్నారు. ఎందరో సీనియర్లు ఉద్ధండుల వారసులు విశాఖ మేయర్ రేసులోకి వచ్చినా జనరల్ సీటులో బీసీ మహిళను ఎంచి మరీ టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. దానికి కారణం శ్రావణి రాజకీయ కుటుంబ నేపధ్యంతో పాటు ఆమె 2021లో గెలిచి టీడీపీ తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించిన తీరు. ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని నిధుల విషయంలో నిలదీసిన విధానం. ఆమె పోరాడే తత్వం. ప్రజలతో కలసి మమేకం అయిన పద్ధతికి ఈ ఉన్నత స్థానం దక్కింది.

భారీ ఆధిక్యతతో :

విశాఖ మేయర్ గా ముక్కా శ్రావణి రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమెతో పాటు 98 దాకా కూటమి నుంచి కార్పోరేటర్లు నెగ్గారు. దాంతో జీవీఎంసీ మొత్తం కూటమి మయం గా మారింది. ఇక శ్రావణి ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమె విద్యాధికురాలిగా ఉన్నారు. దాంతో ఆమె యువ నాయకురాలిగా జీవీఎంసీని ఎలా తీర్చిదిద్దుతారో అన్నది అంతా ఆసక్తిగా ఇపుడు చర్చించుకుంటున్నారు.

రెండోసారి టీడీపీ :

ఇక తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పదవిని అందుకోవడం ఇది రెండవ సారి. సరిగ్గా ఇప్పటికి 40 ఏళ్ళ క్రితం 1987లో ప్రత్యక్ష ఎన్నికల్లో నాడు ప్రముఖ న్యాయవాదిగా ఉన్న డీవీ సుబ్బారావుని అప్పటి సీఎం ఎన్టీఆర్ కోరి మరీ ఎంపిక చేశారు. అలా ఆయన విశాఖ ప్రజల మద్దతుతో మేయర్ అయ్యారు. తిరిగి ఇన్నాళ్ళకు ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ గా ముక్కా శ్రావణి ఆ చాన్స్ దక్కించుకుంది. అలా టీడీపీకి ఇన్నేళ్ళ తరువాత ఈ అత్యున్నత పీఠం దక్కింది అని అంటున్నారు.

కీలక బాధ్యతలు :

ఇక ముక్కా శ్రావణికి చిన్న వయసులోనే ఈ కీలకమైన పదవి లభించింది. రాష్ట్రంలో నెగ్గిన ఇతర మేయర్ల కంటే ఆమె యంగెస్ట్ అని కూడా అంటున్నారు. ఇంకా అవివాహితగా ఉన్న శ్రావణి ఎన్నికల వేళ ప్రచారంలో తనకు పుట్టిల్లూ మెట్టిల్లూ అన్నీ విశాఖే అని శ్రావణి చెప్పారు. అందువల్ల తాను ప్రజలకు బాధ్యతగా ఉంటాను అని చెప్పారు. ఇక విశాఖ జిల్లా ప్లస్ అనకాపల్లి జిల్లా కలిపితే జీవీఎంసీ. ఎంతో మంది సీనియర్ నేత, మాజీ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అందరితో కలసి ఆమె పనిచేయాల్సి ఉంది. అలాగే యువ నాయకత్వాన్ని టీడీపీ ఇటీవల కాలంలో ప్రోత్సహిస్తోంది. దాంతోనే ఆమెకు ఈ చాన్స్ దక్కింది అని అంటున్నారు. విశాఖ మీద ఏపీలో కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన నేపధ్యంలో మొత్తానికి మొత్తం సీట్లు కట్టబెడుతూ విశాఖ వాసులు అతి పెద్ద బాధ్యతను అందించారు. దాంతో రానున్న కాలంలో విశాఖ అభివృద్ధికి మేయర్ పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

Tags:    
  • mukkasravani 
  • visakhapatnammayor 
  • vizagmayor 
  • tdp 
  • gvmc 
  • andhrapradeshpolitics 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS