• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూటమి డెడ్లీ...

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

| ఏపీలో టీడీపీ కూటమి డెడ్లీ కాంబో అని 2024 ఎన్నికల్లో రుజువు అయింది. అప్పట్లో 56 శాతం ఓటు షేర్ అలాగే 95 శాతం సీట్ షేర్ ని సాధించిన కూటమి అధికార వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది.

By - Satya P
Update: 2026-11-04 00:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి డెడ్లీ కాంబో అని 2024 ఎన్నికల్లో రుజువు అయింది. అప్పట్లో 56 శాతం ఓటు షేర్ అలాగే 95 శాతం సీట్ షేర్ ని సాధించిన కూటమి అధికార వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. ఇక రెండున్నరేళ్ళ తర్వాత పరిస్థితులు మారుతాయని అనుకుంటే మరోసారి కూటమి విన్నింగ్ కాంబో అని రుజువు చేసింది. ఈసారి ఏకంగా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దిశగా దూసుకునిపోవడం ద్వారా వైసీపీని ఫల్టీ కొట్టించింది అని అంటున్నారు. ఒక విధంగా తాము లేచి నిలబడతామని వైసీపీ అనుకుంది. కానీ వైసీపీకి అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు చావు దెబ్బ కొట్టాయని అంటున్నారు.

ఓట్ల బదిలీ పెర్ఫెక్ట్ :

ఇటీవల కాలంలో ఒక మాట రాజకీయ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అదేంటి అంటే కూటమిలో కో ఆర్డినేషన్ తప్పుతోంది అని. పై స్థాయిలో చంద్రబాబు పవన్ మాధవ్ ఒక్కటిగా ఉన్నా దిగువ స్థాయిలో మాత్రం గ్రౌండ్ లెవెల్ లో పొరపొచ్చాలు ఉన్నాయని అంతా ఎవరికి వారుగా ఉన్నారని కూడా ప్రచారం సాగుతూ వచ్చింది. కానీ అర్బన్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లో చూస్తే కనుక ఓట్ల బదిలీ పెర్ ఫెక్ట్ గా సాగింది. నిజానికి సీట్ల సర్దుబాటు విషయంలో కూటమి ఎంతో ఎక్సర్ సైజ్ చేయాల్సి వచ్చింది. ఎవరికి ఎక్కడ ఎన్ని సీట్లు అని భారీగానే మధింపు చేయాల్సి వచ్చింది. చివరి నిమిషం వరకూ సాగిన ఈ కసరత్తు కూటమి విజయం మీద ప్రభావం చూపిస్తాయని అంతా అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు, అసంతృప్తులు అని వినిపించిన మాటలు పటాపంచలు అయ్యాయి. ఎవరిని ఎక్కడ నిలబెట్టినా కూటమి అభ్యర్ధికే ఓటు వేసి అందరూ గెలిచేలా చూసుకున్నారు అంటే కూటమి కాంబో గ్రౌండ్ లెవెల్ లో కూడా గట్టిగానే కో ఆర్డినేషన్ తో ఉందని ఈ ఫలితాలు నిరూపించాయని అంటున్నారు.

అధినాయకత్వం కోసం :

ఏపీలో కూటమి మరిన్ని ఎన్నికలు గెలవాలని ఏపీ అభివృద్ధికి కూటమి పాలన ఉండాలన్న మాటలు అధినేతలు చెప్పిన విషయాలు అన్నీ క్షేత్ర స్థాయి దాకా చేరాయని అంటున్నారు. అందుకే ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా టాప్ టూ బాటమ్ అంతా ఏకత్రాటి మీద కలసి పనిచేశారు అని అంటున్నారు. దీంతో ఏపీలో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి దక్షిణ కోస్తా రాయలసీమ అన్న తేడా లేకుండా ఒక్కటే విక్టరీ సౌండ్ వినిపించింది అని అంటున్నారు. నిజానికి దేశంలో ఎక్కడైనా కూటమి కట్టిన పార్టీలకు అధికారంలోకి వచ్చాక విభేదాలు పొడసూపుతాయి. కానీ ఏపీలో మాత్రం అవేమీ జరగకపోవడం విశేషం. మరి ఇదే స్పూర్తితో ఇదే తీరున డెడ్లీ కాంబోతో ముందుకు సాగితే మాత్రం 2029లో వైసీపీ మరింత గట్టిగానే పోరాడాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    
  • tdp 
  • janasena 
  • bjp 
  • tdpalliance 
  • pavankalyan 
  • chandrababu 
  • ysrcp 
  • aplocalbodyelections 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS