• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తమిళనాడుకు ప్రత్యేక జెండా...

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

| ఈ దేశానికి ఒక్కటే జెండా ఉంటుంది. అది మువ్వన్నెల జెండా. అదే జాతీయ పతాకం. రెండు సందర్భాలలో ఆ జెండాకు అంతా వందనం చేయడం ఒక సంప్రదాయం.

By - Satya P
Update: 2026-11-03 18:16 GMT

ఈ దేశానికి ఒక్కటే జెండా ఉంటుంది. అది మువ్వన్నెల జెండా. అదే జాతీయ పతాకం. రెండు సందర్భాలలో ఆ జెండాకు అంతా వందనం చేయడం ఒక సంప్రదాయం. ఆగస్టు 15న, అలాగే జనవరి 26న జెండా వందనం చేస్తూ దేశ భక్తిని ప్రజలంతా చాటుకుంటారు. ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. భిన్న భాషలు ప్రాంతాలు వైఖరులు ఉన్నా దారానికి గుచ్చిన పూల మాదిరిగా అందరినీ ఒక్కటిగా ఉంచేదే జాతీయ పతాకం. మరి రాష్ట్రానికో సంస్కృతి ఉందై తమకూ ప్రత్యేక జెండా కావాలని కోరడం ఒక విడ్డూరమే అవుతుంది. అంతే కాదు అది దారం నుంచి పూవులను విడదీసే దుస్సంప్రదాయం అని అంటున్నారు దేశ భక్తులు. దీని మీద ఒక బిగ్ డిబేట్ అయితే ఇపుడు జరుగుతోంది.

టీవీకే మంత్రి మాటలు :

టీవీకే ప్రభుత్వంలో విజయ్ తరువాత ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించే మంత్రిగా అధవ్ అర్జున్ ఉన్నారు. ఆయన ఎపుడూ సంచలన ప్రకటనలు చేస్తూ ఉంటారు. తాజాగా నవంబర్ 1న దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తమిళనాడుకు ఆ రోజు ఒక ప్రత్యేకతగా భావించి కార్యక్రమాలను జరుపుకుంటారు. ఇక ఈ సందర్భంగా అధవ్ అర్జున్ అన్న మాటలు చేసిన ప్రకటనలు అయితే ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. తమిళనాడుకు ఒక ప్రత్యేక జెండా కావాలని అధవ్ అర్జున్ కోరడమే దీనికి కారణం. ఈ విధంగా జెండా ఉంటే అది తమిళనాడు సంస్కృతి తమిళ భాష గొప్పదనాన్ని చాటి చెప్పడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. అందుకే ఒక రాష్ట్ర జెండాను రూపొందించాలని ఆయన తమ టీవీకే ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అలా ఎగరేయాలంటూ :

తమిళనాడులో రాష్ట్రాల పునర్విభజన రోజైన నవంబర్ 1న అలాగే తమిళనాడుగా ఆవిర్భవించిన జూలై 18న ఈ ప్రత్యేక జెండాను ఎగరేయడానికి అవకాశం ఉంటుదని మంత్రి అధవ్ అర్జున్ అంటున్నారు. ప్రతీ ఏటా తమిళ ప్రజలు అధికారికంగా ఈ రాష్ట్ర జెండాను ఎగరేయాలని ఆయన ఆశిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ జెండాను ఎగరేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. తమిళనాడుకు రాష్ట్ర జెండా మీద మంత్రి డిమాండ్ అయితే ఇపుడు బీజేపీ నేతల నుంచి విమర్శలకు గురి అవుతోంది. బీజేపీ నాయకులు దీనిని విచ్చికరమైన ఆలోచనలుగా విమర్శిస్తున్నారు. భారత దేశంతో తమిళనాడు గుర్తింపుని వేరు చేయడమే ఈ ఆలోచన అని మండిపడుతున్నారు. జాతీయ జెండా ఒక్కటే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అంత మాత్రం చేత తమిళ గుర్తింపుకు ఇబ్బంది ఏమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంలో వారికి మేలు చేయాలని ఈ తరహా ఆలోచనలు మానుకోవాలని టీవీకే నేతలకు హితబోధ చేస్తున్నారు.

పాత డిమాండ్ గానే :

అయితే ఈ రోజున టీవీకే మంత్రి అధవ్ అర్జున్ కొత్తగా ఈ డిమాండ్ చేసినట్లుగా ఉన్నా నిజానికి ఇది ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం నాటిది. పాతదే అని అంతా గుర్తు చేస్తున్నారు. 1969లో తొలిసారి సీఎం అయిన కరుణానిధి 1970లోనే తమిళనాడుకు ఒక ప్రత్యేక జెండాను రూపొందించి మరీ అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. అయితే దీనిని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించడానికి అనుమతి నిరాకరించిందని చరిత్ర చెబుతోంది. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు టీవీకే ఆ డిమాండుతో జనంలో కొత్త చర్చను పెడుతోంది అని అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రం కూడా తమకంటూ ప్రత్యేక జెండా ఉండాలని కోరుకుంటూ దానికి చట్టబద్దత కల్పించడానికి ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. మరి ఈ ప్రత్యేక జెండాల డిమాండ్లు ప్రతీ రాష్ట్రం చేసుకుంటూ పోతే రాష్ట్రానికి ఒక జెండా అజెండా సెట్ చేసుకుంటూ వెళ్తే అంతిమంగా అది దేశ సమగ్రతకు సమైక్యతకు విఘాతంగా మారుతుంది అన్న ఆందోళన అయితే అందరిలో ఉంది. రాష్ట్రాలు ఎంత గొప్పవి అయినా దేశం అనే ఒక చట్రంలో ఉంటేనే అందం, గౌరవం అన్న మాటను గుర్తు చేస్తున్నారు.

Tags:    
  • tamilnadu 
  • stateflag 
  • adhavarjun 
  • tvk 
  • nationalflag 
  • indianpolitics 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS