జ‌గ‌న్‌కు ఊహించ‌ని గిఫ్ట్ పంపిన ష‌ర్మిల‌.. మ‌రింత మంటే!

ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుంచి వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి పాల‌న వ‌ర‌కు కూడా.. ష‌ర్మిల నిప్పులు చెరుగుతున్నారు.

Update: 2024-05-05 08:15 GMT

వైసీపీ అధినేత‌, సీఎంజ‌గ‌న్‌కు.. పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఊహించ‌ని గిఫ్ట్ పంపించారు. ష‌ర్మిల ఇటీవ‌ల కాలంలో అంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఏపీలో ఆ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అనుకున్న ఆమె.. ప్ర‌త్యామ్నాయంగా వైసీపీని ఆమె అన్న సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకు న్నారు. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుంచి వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి పాల‌న వ‌ర‌కు కూడా.. ష‌ర్మిల నిప్పులు చెరుగుతున్నారు.

నిజానికి ష‌ర్మిల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు కంటే కూడా.. తీవ్రంగా దాడి చేస్తున్నారు. దీంతో వైసీపీ కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు డిఫెన్స్‌లో ప‌డేప‌రిస్థితి వ‌చ్చింది.ఈ నేప‌థ్యంలోనే సీఎం జ‌గ‌న్ కొన్ని ప్ర‌చార స‌భ‌ల్లో .. ష‌ర్మిల వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. అదేవిధంగా సునీత అంశాన్ని కూడా ప్ర‌స్తా విస్తున్నారు. వీరిద్ద‌రూ కూడా.. చంద్రబాబు చేతిలో రిమోట్ ల మాదిరి మారిపోయార‌ని అంటున్నారు. క‌డ‌ప నుంచి శ్రీకాకుళం వ‌రకు కూడా.. వీరి గురించి మాట్లాడాల్సి వ‌స్తే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

Read more!

దీంతో ష‌ర్మిల‌ తాజాగా సీఎం జ‌గ‌న్‌పై దాడిని మ‌రింత పెంచారు. ఆయ‌నకు ఓ ఊహించ‌ని గిఫ్ట్ పంపి చా రు. అదే... అద్దం. దీనిలో త‌న ముఖం చూసుకోవాల‌ని ష‌ర్మిల సూచించారు. అప్పుడు త‌న‌కు త‌న మొహం(జ‌గ‌న్‌కు) క‌నిపిస్తుందా.. చంద్ర‌బాబు మొహం క‌నిపిస్తుందా? అని ప్ర‌శ్నించారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక ఉన్న హంత‌కుల‌ను కాపాడుతున్నార‌ని తాము ప్ర‌శ్నిస్తే.. త‌మ‌పై ఎదురుదాడి చేస్తున్నార‌ని అన్న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. చంద్ర‌బాబు స్క్రిప్టును తాము చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. చంద్ర‌బాబు చెబితేనే గ‌తంలో ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగింది? జ‌గ‌న్‌ను గెలిపించ‌మ‌ని అడిగింది? అని ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం త‌మ‌కు న్యాయంకావాల‌ని.. న్యాయం చేయాల‌ని మాత్ర‌మే కోరుతున్న‌ట్టు చెప్పారు. అందుకే వివేకా కేసులో నోరు విప్పాల‌ని కోరుతున్నామ‌న్నారు. కానీ.. ఈ విష‌యాన్ని దాచేసి.. తాము చంద్ర‌బాబు కీలు బొమ్మ‌ల్లా మారామ‌ని ఆరోపించ‌డం స‌మంజ‌సమా? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితిపై తనకు అనుమానం ఉంద‌న్నారు.

Tags:    

Similar News