కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ మార్పు... షర్మిళ సంచలన వ్యాఖ్యలు!

కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిళ.. ప్రచారాలతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-13 09:21 GMT

కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిళ.. ప్రచారాలతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎక్కడ మైక్ పట్టుకున్నా... వివేకానంద రెడ్డి మర్డర్ కేసు.. అందులో అవినాష్ పాత్ర.. అతడిని జగన్ కాపాడుతున్నాడనే విమర్శలే ప్రధనంగా చేస్తున్నారు. ఈ సమయంలో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ ని మారుస్తున్నారనే వార్త వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మారుస్తున్నారంటూ వార్త వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో తాను కడప ఎంపీగా నిలబడి, ప్రచారం మొదలుపెట్టిన నాలుగు రోజులు అయ్యిందో లేదో.. వైఎస్ అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మార్చే ఆలోచన చేస్తున్నారంటూ వార్త వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా షర్మిళ లేవనెత్తిన లాజిక్కులు డిఫరెంట్ గా ఉన్నాయని అంటున్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డే హత్య చేశారు కాబట్టి.. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి.. ఓడిపోతారనే భయం ఉంది కాబట్టే అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో... అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారంటే... సీబీఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నట్లే కదా.. సీబీఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా అని తనదైన లాజిక్ లాగారు!

ఇదే క్రమంలో... అవినాష్ రెడ్డిని మారుస్తున్నారంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి కాబట్టే కాదా అని.. ఆయనకు ఈ ఓటమి నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే అభ్యర్థిగా తప్పిస్తున్నారు కదా అని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిళ! ఇదే సమయంలో... అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినా, చేయకపోయినా... వివేకా హత్య జరిగిన సమయంలో సాక్షి టీవీలో ఎందుకని గుండెపోటని చెప్పారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా... కడప జిల్లాలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని.. అవినాష్‌ హంతకుడని ప్రజలు నమ్ముతున్నారని.. ఆయనకు సంబంధించి సీబీఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందని.. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని.. పైగా అతడిని జగన్‌ కాపాడుతున్నారని షర్మిళ నిప్పులు చెరిగారు. సొంత బాబాయ్‌ ని చంపిన వాళ్లకి మళ్లీ సీట్‌ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

Tags:    

Similar News