• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సర్వీసులోకి ఏబీ...

సర్వీసులోకి ఏబీ వెంకటేశ్వర రావు... సీఎస్ ఆదేశాలివే!

| అవును... సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఎత్తివేసింది.

By - Tupaki Desk
Update: 2024-05-31 06:22 GMT

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సస్పెండ్ చేయబడ్డ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరోపక్క ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆయనను సర్వీసులోకి తీసుకుని కాసేపట్లో పోస్టింగ్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఇదొక ఆసక్తికర పరిణామంగా తెరపైకి వచ్చింది.

అవును... సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఎత్తివేసింది. దీంతో ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా... రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా సస్పెన్షన్లు విధించింది. ఈ నేపథ్యంలో ఏబీవీ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించగా.. ఆ సస్పెన్షన్‌ ను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమయంలో... సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌ లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. సస్పెన్షన్‌ ను రద్దు చేసింది సుప్రీంకోర్టు.

దీంతో... అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో... ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

ఈ సమయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే... ఆ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. దీంతో... హైకోర్టు ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ అందజేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
  • Andhrapradesh 
  • Abvenkateswararao 
  • Stategovernment 
  • Csjawaharreddy 
  • Highcourt 
  • Politicalnews 

Similar News

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

Copyright @2026

Powered by Blink CMS