• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రోజా సీట్లోకి సెల్వమణి...

రోజా సీట్లోకి సెల్వమణి రానున్నాడా...?

| ఇపుడు రోజాకి టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు ఓ వైపు చెబుతూంటే జనసేన కూడా తమకు బలం ఉందని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-17 03:00 GMT

నిజంగా ఇది షాకింగ్ న్యూస్ గానే చూడాలని అంటున్నారు. ఆర్కే రోజా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆమె నగరి నుంచి 2014, 2019లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా వరసగా గెలిచారు. 2024లో ఆమె గెలుపు మీద అనుమానాలు చాలా ఉన్నాయి. ఇక రోజా ఉన్న నగరిలో టీడీపీ బాగానే పుంజుకుంది. అక్కడ గాలి ముద్దు క్రిష్ణమనాయుడు కుటుంబానికి బలం ఉంది.

గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని కొత్తగా దూసుకుని వస్తోంది సైకిల్ పార్టీ. గాలి కుమారుడు భాను ప్రకాష్ జనంలో కలియతిరుగుతున్నారు. టీడీపీ సర్వేలలోనే కాదు వైసీపీ సర్వేలలో కూడా నగరిలో రోజాకు ఇబ్బంది అని వస్తోంది. దాంతో టీడీపీ హుషార్ చేస్తోంది.

ఇక రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో ప్రత్యర్థులు తయారయ్యారు. ఆమె మాత్రం మినిస్టర్ గా ఉంటూ అటు చంద్రబాబు ఇటు పవన్ ల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమె హాట్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆమె సొంత నియోజకవర్గంలో గెలించేందుకు ఇవి సరిపోతాయా అంటే అక్కడ సీన్ మొత్తం రివర్స్ లో ఉంది అని అంటున్నారు.

ఇక ఆమె గతంలో రెండు సార్లు పోటీ చేసి గెలిచినా మెజారిటీలు కూడా తక్కువగా వచ్చాయని అంటున్నారు. 2014లో గాలి ముద్దు క్రిష్ణమనాయుడు మీద జస్ట్ 858 ఓట్ల తేడాతోనే బయటపడ్డారు. ఇక 2019లో అంటే జగన్ వేవ్ బాగా ఉన్న టైం లో ఆమె నగరిలో గాలి భాను ప్రకాష్ మీద రెండు వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 77 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదే 2014లో 73 వేల ఓట్లు వచ్చాయి. అంటే కచ్చితంగా బలంగా టీడీపీ ఉంది అని లెక్క వేసుకోవాలి.

ఇపుడు రోజాకి టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు ఓ వైపు చెబుతూంటే జనసేన కూడా తమకు బలం ఉందని అంటున్నారు. ఆ పార్టీకి పెరిగిన గ్రాఫ్ తో పొత్తులు ఉంటే కనుక టీడీపీకి ప్లస్ అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈసారికి రోజాకు టికెట్ ని పక్కన పెట్టి ఆమె భర్త సెల్వమణికి ఇచ్చేందుకు వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

అలా చేయడం వల్ల రోజా ఫ్యామిలీకే టికెట్ ఇచ్చినట్లు అవుతుందని, ఆమె భర్త తమిళుడు, మొదలియార్ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నగరిలో టోటల్ గా సీన్ టర్న్ అవుతుందని ఆశిస్తున్నారు. అంతే కాదు ఇతర బీసీ వర్గాలు కూడా వైసీపీ వైపుగా మారుతారని అలా విజయం తధ్యమని వైసీపీ కొత్త ఆలోచన చేస్తోంది అని అంటున్నారు మరి అదే నిజమైతే రోజా కారణంగా ఆమె భర్త తమిళ సినీ దర్శకుడు అయిన సెల్వమణి రాజకీయాల్లోకి వస్తారా అన్న టాపికే ఆసక్తిగా ఉంది.

Tags:    
  • Andhrapradesh 
  • Politics 
  • Roja 
  • Politicalparties 
  • Elections 
  • Ycp 
  • Selvamani 
  • Tdp 
  • Politicalnews 

Similar News

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

2026-11-11 03:52 GMT

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS