• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జగన్ గ్రౌండ్ లోకి...

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

| 2024 ఓటమి తర్వాత జగన్ తాడేపల్లి, బెంగళూరుకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ సర్వేలతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలని సూచనలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జిల్లాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించాలని, 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-11 03:52 GMT

వైసీపీ అధినేత జగన్ 2024 ఓటమి తరువాత ఎక్కువగా తాడేపల్లి టూ బెంగళూరు గానే షటిల్ సర్వీస్ చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన పార్టీ వారితో అపుడపుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అది కూడా నియోజకవర్గాల ఇంచార్జిలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్ నేతలు ఇలా పై స్థాయిలో మాత్రమే. వారితో మాట్లాడుతూ పార్టీని వారి ద్వారానే నడిపిస్తున్నారు. ఇక అక్కడ వచ్చే ఇన్ పుట్స్ అన్నవి అధినాయకత్వానికి అందుతున్నాయి. కానీ అవే నిజం అనుకుంటే గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతుందో ఫీడ్ బ్యాక్ ఎలా తెలుస్తుంది అన్నది చర్చగా ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం అక్కడితో ఆగకుండా తమ సొంత సర్వేలు చేయిస్తోంది. అలా ఏపీలో ఓటమి మీద చేయించిన సర్వేలలో చాలా విషయాలు తెలిసాయని అంటున్నారు.

ఎంతవరకూ చూడాలి :

ఇక ఈ సర్వే నివేదికలు అన్నవి కూడా కొంత పరిమితితో కూడి ఉంటాయని అంటున్నారు. నిజానికి వైసీపీకి సర్వేలు పెద్దగా అచ్చి రాలేదని అంటారు. 2019 ఎన్నికల వేళ తప్పించి 2024 సర్వేలు పూర్తిగా బోల్తా కొట్టించాయి. అంతకు ముందు పలు సందర్భాల్లో చేయించిన సర్వేలు కూడా పూర్తి వాస్తవాలను అధినాయకత్వం ముందు ఉంచలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. మరి ఈ సర్వేలు అయితే ఒక మాదిరి పిక్చర్ ని మాత్రమే ఇస్తాయని తెలుస్తోంది. దాంతో పూర్తి విషయలు తెలియాలి అంటే ఏమి చేయాలి అన్నది ప్రశ్న ఉంది. దానికి జవాబు కూడా ఉంది. అదే జగన్ గ్రౌండ్ లెవెల్ లోకి డైరెక్ట్ గా దిగాల్సిందే అని అంటున్నారు.

సమీక్షలు అక్కడే :

వైసీపీ అధినాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మధింపుని చేస్తోంది అని అంటున్నారు. అయితే అవి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కాకుండా జిల్లాలకు వెళ్ళి క్షేత్ర స్థాయిలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతో పాటు క్యాడర్ తో కలిసి కూర్చుని చర్చిస్తేనే పూర్తి సమాచారం పక్కాగా వస్తుంది అని అంటున్నారు. లేకపోతే మాత్రం ఎప్పటికీ వైసీపీకి ఈ ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. ఏపీలో వైసీపీకి గత అనుభవాలు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి. కానీ 2024 తరువాత పరిస్థితులు వేరు అని అంటున్నారు.

బలంగా కూటమి :

రాజకీయాల్లో కూటములు బలంగా ఉన్నపుడు సహజంగానే మొగ్గు ఆ వైపు ఉంటుంది. ఏపీలో కొన్ని రీజియన్లలో అదే జరుగుతోంది అని అంటున్నారు. ఇక కొన్ని చోట్ల తీసుకుంటే వైసీపీకి బలం ఉండి కూడా ఎత్తిగిల్లలేకపోతోంది. మరి కొన్ని చోట్ల అన్నీ ఉండి వర్గ పోరుతో సతమతం అవుతోంది. ఇలా వివిధ కారణాలు ఉన్నాయి. ఇక ఇన్ చార్జిలలో అనేక మంది గడచిన రెండున్నరేళ్లుగా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడం లేదని చెబుతున్నారు. అలాగే క్యాడర్ కి లీడర్లకు మధ్య గ్యాప్ అలాగే ఉందని అంటున్నారు. అది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగడం వల్లనే చేదు ఫలితాలు వచాయని చెబుతున్నారు.

సంస్థాగతంగా :

అదే విధంగా చూస్తే సంస్థాగతంగా వైసీపీ నిర్మాణంలో కూడా మరమ్మతులు చేయాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల ఇన్ చార్జిలను అధినాయకత్వం ప్రకటించింది. వారిని పై నుంచి దిగుమతి చేసింది. దాంతో క్యాడర్ మెచ్చిన నాయకులు కొన్ని చోట్ల ఉంటే మరి కొన్ని చోట్ల లేరని అంటున్నారు. అలా కాకుండా క్యాడర్ తో చర్చించి అందరికీ అందుబాటులో ఉండే వారిని ఇకనైనా ఏర్పాటు చేసుకుంటే 2029 ఎన్నికల నాటికి వైసీపీ బలపడుతుందని అంటున్నారు. పార్టీ కోసం గట్టిగా పనిచేసేవారికి ఛాన్స్ ఇవ్వాలని అలాగే 2029 ఎన్నికల్లో వారికే చాన్స్ ఇస్తామని భరోసా కల్పించాలని అపుడే వారు గట్టిగా పనిచేస్తారు అని అంటున్నారు.

Tags:    
  • ysjagan 
  • ysrcp 
  • appolitics 
  • jaganelectionstrategy 
  • jagan 

Similar News

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

Copyright @2026

Powered by Blink CMS