• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జగన్ డెసిషన్ షాకింగ్...

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

| మహాసేన రాజేష్.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ స్పందనను నియంత్రించాలని జగన్ ఇచ్చిన ఆదేశాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ విడాకుల వ్యవహారంపై రాజకీయ విమర్శలు వస్తాయని భావించానని, కానీ జగన్ క్యాడర్‌ను వ్యక్తిగత విషయాలపై మాట్లాడవద్దని సూచించడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయం వేరని, ఏపీలో హుందా రాజకీయాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

By - Satya P
Update: 2026-11-11 03:54 GMT

మహాసేన రాజేష్ రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచితులే. ఆయన టీడీపీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. ఇదిలా ఉంటే ఆయన సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటారు. ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చేశారు. అందులో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడాకుల విషయం ఒక షాకింగ్ అయితే అంతకు మించి వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం తనకు షాక్ కి గురి చేసింది అన్నారు. పైగా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని కితాబు ఇచ్చారు. ఇంతకీ జగన్ తీసుకున్న డెసిషన్ ఏమిటి, మహాసేన రాజేష్ కి షాక్ ఎందుకు ఇచ్చింది అంటే మ్యాటర్ చూడాల్సిందే.

వైసీపీ రియాక్షన్ మీదనే :

పవన్ కళ్యాణ్ విడాకుల విషయం షాకింగ్ గా అనిపించింది అని రాజేష్ చెప్పుకొచ్చారు. ఆ వెంటనే వైసీపీ వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా ఆలోచించాను అన్నారు. నిజానికి వైసీపీ సొషల్ మీడియాలో ఇలాంటి ఇష్యూస్ మీద గట్టిగా చెలరేగిపోతుందని భావించాను ఆయన అన్నారు. అయితే జగన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు, పర్సనల్ విషయాల మీద ఎవరూ మాట్లాడవద్దు అంటూ తన క్యాడర్ కి సందేశం ఇచ్చారు అని తెలిసిందని అన్నారు. ఇది నిజంగా షాక్ అని ఆయన అంటున్నారు.

తొలిసారి చూశాను :

ఇక వైసీపీ వాళ్లో ఎక్కువ మంది రప్పా రప్పా బ్యాచ్ అని గంజాయ్ బ్యాచ్ అని తాము విమర్శిస్తామని వారు కూడా అలాగే వ్యవహరిస్తారు అని రాజేష్ కామెంట్స్ చేశారు. కానీ పవన్ తాజా వ్యక్తిగత జీవితంలో సంభవించిన పరిణామాలు మీద మాత్రం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ వారు కూడా ఎంతో క్రమశిక్షణ పాటించడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని ఆయన అంటున్నారు. ఫస్ట్ టైం వారిలో ఈ విధమైన డిసిలిప్లిన్ చూశాను అని రాజేష్ చెప్పుకొచ్చారు.

హుందాగా ఉండాలి :

ఇక టీడీపీ ఎపుడూ హుందాగానే వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. ఐటీడీపీ కూడా ఈ విషయం మీద తమ క్యాడర్ సహనంగా ఉండాలని ఒక సందేశం పంపించింది అని ఆయన గుర్తు చేశారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని క్రమశిక్షణగా ఉండాలని టీడీపీ పెద్దలు చెబుతూనే ఉంటారు అని ఆయన అన్నారు. ఏది ఏమైనా పవన్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల మీద రాజకీయ పార్టీల నుంచి ఘాటు రియాక్షన్లు రాకుండా కట్టడి చేసిన తీరుని ఆయన అభినందించారు. వైసీపీ రాజకీయ వ్యూహంలో ఇదంతా భాగమా లేదా మరోటా అన్నది పక్కన పెడితే ఇలాంటి వాతావరణం అంతటా ఉండాలని మహాసేన రాజేష్ కోరుకున్నారు.

రాష్ట్రానికి మంచిది :

ఏపీలో హుందా రాజకీయాలకు ఈ విధంగా బీజం పడిందని రాజేష్ అన్నారు. లేకపోతే ఇదే టాపిక్ మీద ఏపీలో రచ్చ అయ్యేదని అన్నారు. వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు అని ఆయన అన్నారు. విధానాల మీదనే ఏ పార్టీ అయినా మాట్లాడాలి తప్పించి వ్యక్తిగతం జోలికి వెళ్లరాదు అని ఆయన కోరారు. తమిళనాడులో చూస్తే విజయ్ సొంత వ్యవహారాల మీద ప్రతిపక్షాలు మాట్లాడటం లేదని అన్నారు. హుందాగా అక్కడ నడిచే రాజకీయం ఏపీలో కూడా అంతా కోరుకుంటున్నారు అని రాజేష్ చెప్పారు. ఏది ఏమైనా ఏపీలో ఈ తరహా రాజకీయానికి ప్రస్తుత రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టడం రాష్ట్రానికే మేలు అని ఆయన అంటున్నారు.

Tags:    
  • mahasenarajesh 
  • ysjagan 
  • pawankalyan 
  • ysrcp 
  • tdp 
  • appolitics 

Similar News

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

20 ఏళ్ల తర్వాత రాజాంలో ఎన్నికల సందడి.. తొలి పాలకవర్గంపై ఉత్కంఠ!

2026-11-12 17:30 GMT

విజయసాయి పీఆర్పీకి నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా కష్టమేనా ?

2026-11-12 17:05 GMT

పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు

2026-11-12 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS