• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  విజయసాయి పీఆర్పీకి ...

విజయసాయి పీఆర్పీకి నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా కష్టమేనా ?

| మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్థాపించిన పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) 2029 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్, బూత్ స్థాయి యంత్రాంగం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో కొత్త పార్టీకి ప్రజాదరణ ఎంతవరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

By - Satya P
Update: 2026-11-12 17:05 GMT

విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ, వైసీపీలో కీలక నాయకుడుగా మెలిగారు. అయితే ఆయన కొత్త పార్టీ పెట్టడం మాత్రం రాజకీయంగా అయితే పెద్దగా సౌండ్ చేయలేదనే అంటున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు అని విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎపుడూ గెలవలేదు అని గుర్తు చేసుకుంటున్నారు. తన పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ అని మొత్తం 175 సీట్లలో 2029లో పోటీ చేస్తామని విజయసాయిరెడ్డి ఇచ్చిన స్పీచ్ అంతా పబ్లిసిటీ స్టంట్ గానే చూస్తున్నారు. విజయవాడ వంటి రాజకీయ రాజధానిలో మాజీ ఎంపీ చేసిన రాజకీయ హడావిడి అయితే రాజకీయ వర్గాల్లో హాస్యస్పదంగా మారింది అని అంటున్నారు.

వంద ఓట్లు అయినా :

విజయసాయిరెడ్డి ఎక్కువ ఊహించుకుంటున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆయన తెర వెనక ఉండేవారే తప్ప తెర ముందు కాదని గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టి జనాలను ఆకట్టుకుని ఓట్లు రాబట్టుకోవడం అన్నది ఒక మహా యజ్ఞం అని గుర్తు చేస్తున్నారు. 'వారసత్వ రాజకీయాల ముగింపు', '66 శాతం సీట్లు యువత'కే అంటూ ఇచ్చే నినాదాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ క్షేత్రస్థాయి సమీకరణాల ప్రకారం ఆయన పార్టీ అభ్యర్థులకు అసెంబ్లీ స్థానానికి కనీసం 100 ఓట్లు రావడం కూడా గగనమే అనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు.

మూడవ శక్తి అంటూ :

మాజీ ఎంపీది రాజకీయ బిల్డప్ గానే అంతా చూస్తున్నారు. ఏపీలో మూడవ రాజకీయ శక్తి అంటూ విజయసాయిరెడ్డి చేసేది అక్షరాలా రాజకీయ విన్యాసమే తప్ప వేరొకటి కాదని అంటున్నారు. ఏపీలో ఓటర్ల మైండ్ సెట్ కానీ జడ్జిమెంట్ ట్రాక్ రికార్డు కానీ చూస్తే విజయసాయిరెడ్డి పీఆర్పీకి డిపాజిట్లు గల్లంతు కంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ విజయసాయిరెడ్డి అవగాహన చేసుకున్నారా లేదా అని ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

మాస్ ఇమేజ్ ఏదీ :

ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలీ అంటే మాస్ ఇమేజ్ ఉండాలి. జన సామాన్యంలో బలంగా నలిగిన వారుగా ఉండాలి. కానీ విజయసాయిరెడ్డి పెద్దల సభలో సభ్యుడే తప్ప జనం ఓట్లతో గెలిచిన వారు కాదు కాదా అని విశ్లేషిస్తున్నారు. ఆయన జీవితంలో ఒక ఆడిటర్‌గా, లీగల్ సలహాదారుగా, లేదా అధినేత వెనుక ఉండి తెరవెనుక వ్యూహాలు పన్నే వ్యక్తిగానే కొన్ని వర్గాల ప్రజలకు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలుసు. అలాంటి నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్న ఏపీ లాంటి చైతన్యవంతమైన రాజకీయ క్షేత్రంలో. ఓట్ల పంట పండించాలంటే దిగ్గజ సినీ నటులకు మాస్ హీరోలకే సాధ్యం కాలేదన్న గతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

జనాకర్షణ ముఖ్యం :

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. కానీ రాజకీయాల్లో ఓట్లు రాలాలంటే పవన్ కళ్యాణ్ లాంటి గ్లామర్, లేదా చంద్రబాబు, జగన్‌ల లాంటి మాస్ అపీల్ ఉండాలని అంటున్నారు అంతే తప్ప మీడియా సమావేశాలు పెట్టి సోషల్ మీడియా పోస్టులతోనో మైకుల ముందు మాట్లాడితేనో ఎవరైనా జన నాయకుడు కాలేరని అంటున్నారు. జనాకర్షణ లేని వారు పార్టీ పెట్టడం నేల విడిచి సాము చేయడం అవుతుందని అంటున్నారు. ఓటర్లు ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూడరనేది గత చరిత్ర చెప్తున్న చేదు నిజంగానూ గుర్తు చేస్తున్నారు.

రెండుగా చీలిన రాజకీయం :

ఏపీలో చూస్తే రాజకీయం అంతా రెండుగా చీలి ఉంది. ఇది దశాబ్దాలుగా సాగుతున్న వైనంగా అంతా చూస్తున్నారు ఒకవైపు పటిష్టమైన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉంటే మరోవైపు వైసీపీ ఉంది. ఇక ఏపీ ఓటర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే తమ ఓటు వృథా కాకూడదనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ఈ రెండు పెద్ద శక్తులకే ఓట్లు గుద్దుతారు. ఇంతటి తీవ్రమైన పోటీ వాతావరణంలో గెలిచే అవకాశం లేని విజయసాయిరెడ్డి పార్టీకి ఓటేసి వృధా చేసుకోవడానికి ఏ ఓటరూ సిద్ధంగా ఉంటాడు అన్నది పెద్ద ప్రశ్న. అందుకే ఆయన పీఆర్పీ పేరుతో అన్ని చోట్లా కష్టపడి అభ్యర్థులని దించినా కూడా చాలా నియోజకవర్గాల్లో నోటాకంటే తక్కువ ఓట్లతో దారుణంగా వెనకబడే ప్రమాదం ఉందని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

యంత్రాంగం ఉందా :

రాజకీయ పార్టీ చాలా మంది పెట్టినా సంస్థాగతంగా బలం ముఖ్యం. అలా చూస్తే పీఆర్పీకి క్యాడర్ సున్నాగానే అంటున్నారు. అలాగే బూత్ ఏజెంట్లు కూడా దొరకరని టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే వారికి కనీసం కొన్ని వందల ఓట్లు రావాలన్నా బూత్ స్థాయిలో బలంగా పనిచేసే కార్యకర్తల యంత్రాంగం ఉండాలన్నది కీలక సూత్రం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా 200కి పైగా పోలింగ్ బూత్‌లు ఉంటాయన్నది ఒక లెక్క. ఆ బూత్‌లలో కుర్చీలు వేసుకుని కూర్చోడానికి కూడా మాజీ ఎంపీ వద్ద మనుషులు లేరన్నది పచ్చి నిజంగా చెబుతున్నారు. విజయసాయిరెడ్డి అంటే పెద్దల సభ సభ్యుడిగానే ఎపుడూ వైసీపీలో ఉన్నారు. అలాంటి ఆయన వెంట ఈ రోజున నడిచేందుకు ఏ ఒక్క అసలైన కార్యకర్తా లేడనే అంటున్నారు. వైసీపీలో అధికారాన్ని ఆయన అనుభవించినప్పుడు ఆయన చుట్టూ చాలా మంది నేతలు తిరిగి ఉండొచ్చు. అయితే ఎపుడైతే ఆయన పార్టీని వీడిపోయారో వారు ఎవరూ ఈ రోజున ఆయన వెంట నడవడానికి సిద్ధంగా లేరని కూడా అంటున్నారు. .

పీఆర్పీ అంటూ వచ్చినా :

మెగాస్టార్ చిరంజీవి 2008లో తనకు అప్పటికే ఉన్న అపారమైన జనాదరణతో ‘ప్రజారాజ్యం పార్టీ ని పెట్టారు. అది షార్ట్ కట్ లో పీఆర్పీగా జనంలో నాంది. అయితే ఎక్కువ కాలం పీఆర్పీ అన్నది రాజకీయాల్లో లేదు అని గుర్తు చేస్తున్నారు. మెగాస్టార్ కే సాధ్యం కానీ పీఆర్పీ ఫీట్ ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఎలా సక్సెస్ తెస్తుందని కూడా చర్చిస్తున్నారు. ఆయన పరివర్తన రాజనీతి పార్టీ అని పేరు పెట్టి సంక్షిప్తంగా పీఆర్పీ అని ప్రచారం చేసుకుంటున్నా రాజకీయంగా వేరే సౌండ్ ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి లాంటి మాస్ ఐకాన్ ముందే నిలబడలేని ఆ మూడు అక్షరాలు, పబ్లిక్ ఇమేజ్ ఏ మాత్రం లేని విజయసాయిరెడ్డి నాయకత్వంలో మరెంత నవ్వులపాలవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటున్నారు.

పరివర్తన ఎవరికి :

చివరిగా అంతా అంటున్న మాట ఒక్కటే. రాజకీయ పరివర్తన ఎవరికి అన్నది. విఫల ప్రయోగం తరువాత కలిగితే పరివర్తనేనా అని సెటైర్లు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఎన్ని లీగల్ వ్యూహాలు పన్నినా ఎన్ని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చినా కూడా ఓటర్లు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక అసలైన ఓటింగ్ రోజు వచ్చేసరికి అగ్ని పరీక్ష ఉంటుందని ఒక్క సీటు గెలుస్తారా అన్నది పక్కన పెడితే ఏపీలోని 175 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో ఆయన పార్టీ అభ్యర్థులకు 100 ఓట్ల మార్కు దాటడం కూడా ఒక పెద్ద వింతే అవుతుందని ముందే జోస్యం చెబుతున్న వారూ ఉన్నారు. అందువల్ల ఏపీ రాజకీయాల్లో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ఒక నామమాత్రపు శూన్యంగా మిగిలిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.

Tags:    
  • vijaysaireddy 
  • parivartanarajaneethiparty 
  • andhrapradeshpolitics 
  • apolitics 
  • 2029elections 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS