• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రిని అయ్యాక కూడా నా...

మంత్రిని అయ్యాక కూడా నా తల్లిదండ్రులు రోజూ అడవికి పనికి వెళతారు

| బట్ట కాల్చి మీద పడేసే బ్యాచ్ కొందరుంటారు. అలాంటి వారు ఎదుటోళ్లు ఎవరు? వారి తీరు ఏమిటన్న దాన్ని పట్టించుకోరు.

By - Tupaki Desk
Update: 2024-07-31 05:30 GMT

బట్ట కాల్చి మీద పడేసే బ్యాచ్ కొందరుంటారు. అలాంటి వారు ఎదుటోళ్లు ఎవరు? వారి తీరు ఏమిటన్న దాన్ని పట్టించుకోరు. ఎవరిపైనైనా సరే ఆరోపణలు చేసేస్తుంటారు. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించి అడ్డంగా బుక్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క తండ్రికి గత ప్రభుత్వం పోడు పట్టా ఇచ్చిందన్న అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీతక్క.. తాను అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా ఈ రోజుకు వారి రెక్కల కష్టమ్మీద కష్టపడుతున్నారన్నారు.

ప్రతిరోజు అడవికి వెళ్లి పని చేస్తుంటారన్న ఆమె.. ‘‘నా తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతరు. ఇప్పటికి నా తండ్రి అడవిని నమ్ముకొని రోజు పని చేస్తడు’’ అంటూ సీరియస్ అయ్యారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హత ఉన్నందుకే తన తండ్రి పేరు మీద ఎకరం 17 గుంటల భూమికి హక్కు పట్టా వచ్చిందని.. తన కుటుంబానికి ఎవరూ దానం ఇవ్వలేదన్నారు.

అడవే ఆధారంగా బతికే కుటుంబాలు తమవి అన్న ఆమె.. తాను ఆదివాసీ అయినందుకు తన తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాపై బీఆర్ఎస్ నేతు పదే పదే విమర్శిస్తున్నారన్నారు. పోడు భూముల హక్కుల కోసం తన తండ్రి పోరాడి.. జైలుకు కూడా వెళ్లి వచ్చారని.. తాను మంత్రిగా ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికి అడవిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తారంటూ సీతక్క వెల్లడించారు.

2018లో తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఐదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించని వైనాన్ని గర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను కోర్టును ఆశ్రయించానని చెప్పిన మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతోమంత్రి ప్రజాప్రతినిదులు రైతుబంధు తీసుకున్నారన్నారు. పోడు భూముల చట్టంతో ఎస్టీలకు లబ్థి చేకూరిందన్న సీతక్క.. దాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.

Tags:    
  • Seethakka 
  • Minister 
  • Congress 
  • Brs 
  • Mla 
  • Anijadav 
  • Assembly 
  • Revanthreddy 
  • Ktr 
  • Harishrao 
  • Bjp 

Similar News

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

Copyright @2026

Powered by Blink CMS