'ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటో'. ఇకపై డిస్కషన్ పాయింట్ కాదు!

అవును... ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటో ప్రదర్శించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు!;

Update: 2026-02-11 05:44 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కల్యాణ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటోలను పెడుతున్నారు. అయితే... ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా సీజేఐ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటో ప్రదర్శించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు! ఈ మేరకు విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏము కొండలరావు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, జస్టిస్ ఎస్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రభుత్వ కార్యాలాయల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటో పెడితే మీకొచ్చిన బాధేంటి అని పిటిషనర్ ను ప్రశ్నించి.. పిటిషన్ ను కొట్టివేశారు. దీంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఇకపై "ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫోటో" అనే అంశం డిస్కషన్ పాయింట్ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంతకుముందు పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదని.. అయినప్పటికీ ఆయన ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో, సుమారు 12వేలకు పైగా సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ఈ విధంగా రాజకీయ ప్రభావాన్ని చాటి చెప్పుకోవడం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించకూడదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని వాదించారు. అయితే.. ఆ వాదనలు తిరస్కరిస్తూ ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది.

వాస్తవానికి తొలుత ఈ వ్యవహారం హైకోర్టులోనే కొట్టివేయబడింది. ఇందులో భాగంగా... ఏము కొండలరావు తొలుత దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పిల్ వేశారు. అయితే దీనిని ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో.. ఆ తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా అక్కడా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.. పిటిషన్ కొట్టివేయబడింది.

Tags:    

Similar News