నేత‌ల‌కు 'బూస్ట్‌' క‌రువైందా.. ?

తాజాగా బీజేపీ చేప‌ట్టిన రాష్ట్ర ఉద్య‌మానికి.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ.. క్షేత్ర‌స్థాయి నాయ‌కులు విద్యార్థుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించి దూరంగా ఉన్నారు.

Update: 2026-07-25 09:36 GMT

కూట‌మి పార్టీల్లోని నాయ‌కుల‌కు బూస్ట్ క‌రువైందా? ఇదీ.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నడుస్తున్న చ‌ర్చ‌. విశ్లేష‌కులు కూడా ఇదే విష‌యంపై దృష్టి పెట్టారు. ఇంత‌కీ ఏంటి బూస్ట్‌? అనే సందేహం పెద్ద ఎత్తున వ‌స్తోంది. నేత‌ల‌కు-నేత‌ల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉంటే బూస్ట్‌. లేక‌పోతే ఇబ్బందే. ఇదే ఇప్పుడు కూట‌మి పార్టీల మ‌ధ్య లేకుండా పోయింది. ఇది కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదనే చ‌ర్చ కూడా ఉంది. ఆది నుంచి కూడా ఎవ‌రి రాజ‌కీయాలు వారివే అయిన‌ప్పుడు.. క‌లివిడి కొర‌వ‌డుతున్న ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తోపాటు.. స్థానిక స‌ర్దుబాటు విష‌యంలోనూ బూస్ట్ కొర‌వ‌డింద‌న్న కొత్త మాట వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ నాయ‌కుల‌కు క‌లివిడి మంత్రం ప‌ఠించేలా పార్టీలు హిత‌వు ప‌లుకుతున్నాయి. కానీ, ఇది పైపైకే ప‌నిచేస్తోంది. అంత‌ర్గ‌తంగా మాత్రం ఎవ‌రికి వారు అన్న‌ట్టుగానే ఉన్నారు. ఇది కొత్త‌కాదు. అయితే.. ఇప్పుడు మాత్రం మ‌రింత జోరుగా చ‌ర్చ సాగుతోంది.

తాజాగా బీజేపీ చేప‌ట్టిన రాష్ట్ర ఉద్య‌మానికి.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ.. క్షేత్ర‌స్థాయి నాయ‌కులు విద్యార్థుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించి దూరంగా ఉన్నారు. ఇక‌, జ‌న‌సేన కూడా దాదాపు ఇదే విధంగా దూరంగా ఉండిపోయింది. దీంతో బీజేపీ నాయ‌కులు క‌స్సుబుస్సులాడుతున్నారు. అయితే.. దీనివెనుక కూట‌మి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని కొంద‌రు చెబుతున్నారు. ఒక‌వే ళ విద్యార్థుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైనా.. అది పూర్తిగా ప్ర‌భుత్వంపై చ‌ర్య‌లు తీసుకునేలా ఉండ‌బోద‌ని అంటున్నారు.

ఇక‌, స్థానిక అభివృద్ధి విష‌యంలోనూ నాయ‌కుల మ‌ధ్య బూస్ట్ లేకుండా పోయింద‌న్న వాద‌న వినిపిస్తోం ది. అంటే.. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి జ‌రుగుతున్న సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో బీజేపీ ప్ర‌చారం చేసుకుంటోంది. ఇదేస‌మ‌యంలో కూట‌మి చేస్తున్న సంక్షేమంపై మాత్రం మాట్లాడ‌డం లేదు. ఇది కూడా నాయ‌కుల మ‌ధ్య దూరం పెరిగేలా చేస్తోంది. వీటిని ప‌రిష్క‌రించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. మ‌రోసారి పార్టీ అగ్ర‌నేత‌ల‌తో భేటీ అయి.. ఈ విష‌యాన్ని చ‌ర్చిస్తాన‌ని తాజాగా మంత్రుల‌కు ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ `బూస్ట్‌` అనే విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. క‌లివిడిగా ఉండాల్సిందేన‌ని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News