ఫిరాయింపుల్లో తెలంగాణ టాప్ త్రీ.. వన్, టూ ఎవరంటే?

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ సింఫుల్ గా చెప్పాలంటే ఏడీఆర్ సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది.

Update: 2026-09-25 05:30 GMT

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ సింఫుల్ గా చెప్పాలంటే ఏడీఆర్ సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన జాబితాను సిద్ధం చేశారు. ఈ రిపోర్టులో ఫిరాయింపు నేతలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు మూడో స్థానం సొంతం చేసుకుంది. మొదటి రెండు రాష్ట్రాలుగా నాగాలాండ్ మొదటిస్థానంలో నిలిస్తే.. పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.ఈ రిపోర్టును 2022-26 మధ్య కాలంలో గెలిచిన తర్వాత పార్టీలు మారిన సిట్టింగ్ఎంపీలు.. ఎమ్మెల్యేను పరిగణలోకి తీసుకోవటం జరిగింది. వీరి వివరాలు ఆధారంగా రాష్ట్రాల స్థానాల్ని నిర్ణయించారు.

ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 4876 ప్రజాప్రతినిధుల్లో 17 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం111 మంది సిట్టింగ్ ఎంపీలు.. ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. పార్టీ ఫిరాయించిన 111మందిలో 26 మంది లోక్ సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు.. 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 111 మందిలో 81 మంది మూడు పార్టీల్లో చేరటం గమనార్హం.

ఫిరాయింపు ప్రజాప్రతినిధుల్లో మొదటిస్థానంలో నిలిచిన నాగాలాండ్ రాష్ట్రానికి వస్తే.. అక్కడ 32 మంది ఎమ్మెల్యేలు నాగాలాండ్ లోని నాగా పీపుల్స్ ఫ్రంట్ లో చేరారు. అదే సమయంలో ఏడుగురు రాజ్యసభ సభ్యులు.. 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. నేషనలిస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో 20మంది ఎంపీలు చేరారు. నాగాలాండ్ తర్వాత ఫిరాయింపు నేతలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలిచింది.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ విపక్షటీ ఎంసీకి చెందిన 20 మందిలోక్ సభ ఎంపీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. మూడో స్థానంలో ఉన్న తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. వీరుకాంగ్రెస్ లో చేరారు. ఆసక్తికరమైన మరోఅంశం ఏమంటే.. మొత్తం 111 మంది ఫిరాయింపు ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరు బీజేపీకి చెందిన వారు లేరు. ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు జరగని పరిస్థితి.

పార్టీ ఫిరాయింపు నేతలకు సంబంధించి ఏడీఆర్ కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ కు కాకుండా.. కేంద్రంలోని రాష్ట్రపతికి.. రాష్ట్రాల్లో గవర్నర్ కు అప్పగించాలని చెబుతోంది. అయితే.. ఇది ఎన్నికల సంఘం సలహా మేరకు జరగాలని చెబుతోంది. అంతేకాదు.. పార్టీ ఫిరాయించినా.. పార్టీకి రాజీనామా చేసినా.. సదరు నేత తదుపరి ఎన్నికల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేయటం.. ఎలాంటి పదవులు పొందకుండా ఉండేలా చట్టాన్ని మార్చాలని కోరుతోంది. పార్టీ ఏదైనా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైన సందర్భంలో తమకు ఇరుకున పడేసే ఈ తరహా నిబంధనల్ని చట్టబద్ధం చేసే సాహసం చేస్తారంటారా?

Tags:    

Similar News