సుప్రీంలో దానంకు పంచ్ లు మామూలుగా పడలేదుగా?

విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలు చూస్తే.. దానం నాగేందర్ రాజకీయ జీవితంపై చాలా స్పష్టమైన అవగాహనతో వారు మాట్లాడినట్లుగా కనిపిస్తోంది.

Update: 2026-09-25 05:33 GMT

దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల క్రమాన్ని చూస్తే.. విచారణ సందర్భంగా ఆయనపై ధర్మాసనం వేసిన పంచ్ లు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తుల్లో జస్టిస్ జోయ్ మల్య బాగ్చి.. జస్టిస్ వి. మోహనాలు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయ నేతల నోటి నుంచి తరచూ వినిపించే మాటలే.. విచారణ వేళ న్యాయమూర్తుల నోటి నుంచి రావటం.. ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఘర్ వాపసీ.. ఆయారాం గయారాం.. లాంటి కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలు చూస్తే.. దానం నాగేందర్ రాజకీయ జీవితంపై చాలా స్పష్టమైన అవగాహనతో వారు మాట్లాడినట్లుగా కనిపిస్తోంది.

తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి.. జస్టిస్ వి. మోహనాలు ఉన్నారు. దానం నాగేందర్ తరఫు ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దానంపై తెలంగాణ హైకోర్టు వేసిన అనర్హత వేటును తీసేయాలని కోరుతూ వినిపించిన వాదనలు ఏ దశలోనూ నిలవలేదు.

అన్నింటికి మించి బీఆర్ఎస్ పార్టీని దానం ఇంకా వీడలేదన్న వాదనలో పస లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. దానం మీద పిటిషన్ వేసిందే బీఆర్ఎస్ కు చెందిన నేతలు. అలాంటప్పుడు ఆయన ఆ పార్టీలోనే ఉన్నారన్నట్లుగా వాదనలు వినిపించటంలో ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న. ఒకసారి పరా్టీ మారి అనర్హత ముద్ర పడిన తర్వాత తిరిగి పాత పార్టీలోకి వచ్చినా ఆ అనర్హత చెరిగిపోదన్న సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా ఘర్ వాపసీ వ్యాఖ్య చేయటం గమనార్హం.

దానం నాగేందర్ ఇప్పటికి బీఆర్ఎస్ లోనే ఉన్నారని.. పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారని.. బీఆర్ఎస్ సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు. ఘర్ వాపసీ ద్వారా తిరిగి వచ్చినప్పుడు పార్టీ అంగీకరిస్తే పార్టీ మారిన మరక పోతుందని.. రాజ్యాంగం కూడా తప్పు

Tags:    

Similar News