• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ లిక్కర్ స్కామ్: ఎవరీ...

ఏపీ లిక్కర్ స్కామ్: ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి? అరెస్ట్ వెనుక కారణాలేంటి?

| ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

By - Tupaki Desk
Update: 2025-04-26 11:04 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసింది.

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సిట్ అధికారులు, మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. శనివారం సాయంత్రానికి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన రాజ్ కసిరెడ్డికి తోడల్లుడు అయిన చాణక్య ఇచ్చిన సమాచారం ఆధారంగానే శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

-ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి? రామకృష్ణారెడ్డితో సంబంధం ఏమిటి?

సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే చాలామందికి ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అని సందేహం రావొచ్చు. అయితే, ఈయన రామకృష్ణారెడ్డి కుమారుడు కాదు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని తొండూరు మండలం తుమ్మలపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డికి, రామకృష్ణారెడ్డికి బంధుత్వం ఉన్నప్పటికీ, అది దగ్గరి చుట్టరికం కాదు.

-ఎస్పీవై రెడ్డి అల్లుడు.. వ్యాపారం, రాజకీయ నేపథ్యం:

సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల నుంచి ఓ దఫా ఎంపీగా పనిచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆయన పులివెందుల నుంచి తన మకాంను నంద్యాలకు మార్చారు. నంద్యాల కేంద్రంగా మామగారి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అంతేకాకుండా తన సతీమణి సుజలతో కలిసి ఎస్పీవై రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకున్నారు.

శ్రీధర్ రెడ్డి 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేనలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. పులివెందుల నేటివిటీ, సజ్జల ఇంటిపేరుతో ఆయన తక్కువ కాలంలోనే జగన్‌కు దగ్గరయ్యారని సమాచారం.

-లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఆరోపణలు:

జగన్ ప్రభుత్వ హయాంలో 'జే బ్రాండ్స్'గా ముద్రపడిన మద్యం బ్రాండ్లు ఎక్కువగా నంద్యాల పరిధిలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రంగానే తయారయ్యాయని ఆరోపణలున్నాయి. లిక్కర్ ముఠా ఇతర కంపెనీల నుంచి సేకరించిన మద్యాన్ని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లోనే తమ ప్రమాణాల మేరకు నాణ్యతను మార్చి ప్యాక్ చేశాడని ఆరోపణలున్నాయి.. ఈ విధంగా మద్యం కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కీలక కేంద్రంగా మారిపోయిందని సిట్ విచారణలో తేల్చిందని సమాచారం.

మద్యం పాలసీ రూపకల్పన, ఆయా బ్రాండ్ల ఎంపిక, కంపెనీల నుంచి ముడుపుల ఖరారు, వాటిని స్వీకరించడం, గమ్యస్థానాలకు తరలించడం వంటి అనేక కార్యకలాపాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ భావిస్తోంది. ఈ దందాలో రాజ్ కసిరెడ్డికి ఏ మేర పాత్ర ఉందో, శ్రీధర్ రెడ్డికి కూడా అంతే కీలక పాత్ర ఉందని సిట్ తమ దర్యాప్తులో అనుమానిస్తోంది. తాజా అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.

Tags:    
  • APLiquorScam 
  • SITArrest 
  • SajjalaSridharReddy 
  • RajKasireddy 
  • SPYAgro 
  • AndhraPolitics 
  • LiquorMafia 
  • APCorruption 
  • YSJagan 
  • PoliticalNews 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS