• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి...

93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్న 'మీడియా మొఘల్'

| ఆయనే.. అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్. ప్రపంచవ్యాప్తంగా పలు సంచలన వార్తలతో తన మీడియాను వెలిగిపోయేలా చేసే ఆయన.. తాజాగా తన 93 ఏళ్ల వయసులో ఆయనో ఇంటర్నేషనల్ న్యూస్ గా మారారు.

By - Tupaki Desk
Update: 2024-06-03 04:21 GMT

మీడియా మొఘల్ అన్నంతనే చెరుకూరి రామోజీరావు గుర్తుకు వస్తారు. వాస్తవానికి ఆయన మన దేశానికే పరిమితం. మారిన పరిస్థితులు.. స్థితిగతులతో చూస్తే.. గడిచిన కొంతకాలంగా ఆయన ప్రభ తగ్గుతుందనే చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు చెబుతున్న మీడియా మొఘల్ అంతర్జాతీయంగా తిరుగులేని టైకూన్ గా చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఆయన కన్ను పడితే.. ఏ మీడియా సంస్థ అయినా సరే.. ఆయన హస్తగతం కావాల్సిందే. ఆయనే.. అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్. ప్రపంచవ్యాప్తంగా పలు సంచలన వార్తలతో తన మీడియాను వెలిగిపోయేలా చేసే ఆయన.. తాజాగా తన 93 ఏళ్ల వయసులో ఆయనో ఇంటర్నేషనల్ న్యూస్ గా మారారు.

కారణం.. ఆయన వ్యక్తిగత జీవితంలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లాడిన ఆయన.. తాజాగా 93 ఏళ్ల వయసులో ఐదో వివాహం చేసుకున్నారు. తన కంటే వయసులో పాతికేళ్లు చిన్నదైన రిటైర్డ్ సైంటిస్టు ఎలీనా జుకోవాను పెళ్లాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్ లో వీరి వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా సాగింది. మర్దోక్ విషయానికి వస్తే 1950ల్లో మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన న్యూస్ ఆఫ్ ది వరల్డ్.. ది సన్ వార్తాపత్రికల్ని ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. న్యూయార్క్ పోస్ట్.. వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికల్ని సొంతం చేసుకున్నారు. 1996లో ఫాక్స్ న్యూస్ ప్రారంభించిన మర్దోక్ జీవితం వివాదాల కుప్ప. గత ఏడాది తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకులకు అప్పజెప్పిన ఆయన.. ప్రస్తుతం వాటికి ఆయన గౌరవ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని ఆయన మీడియా సంస్థలోనే అచ్చయ్యాయి. ఈ పెళ్లికి ప్రముఖులు పలువురు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మర్దోక్ వైవాహిక జీవితాన్ని చూస్తే.. ఆయన మొదటి పెళ్లి ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్ ను పెళ్లాడగా.. వారి బంధం 1960లలోనే ముగిసింది. ఆ తర్వాత జర్నలిస్టు అన్నా మరియాను తర్వాత చైనా వ్యాపారవేత్త విన్ డీ డెంగ్ ను పెళ్లి చేసుకున్నారు.

తర్వాత అమెరికా మోడల్ జెర్రీ హాల్ తో పెళ్లి కావటం.. విడాకులు తీసుకోవటం జరిగిపోయాయి. తాజాగా పెళ్లాడిన రిటైర్డ్ సైంటిస్ట్ ఎలీనా జుకోవా విషయానికి వస్తే.. మర్దోక్ మాజీ భార్యల్లో ఒకరైన విన్ డీ డెంగ్ ఇచ్చిన ఒక పార్టీలో పరిచయం కావటం గమనార్హం. ఇక.. జుకోవా విషయానికి వస్తే రష్యాకు చెందిన ఆమె అమెరికాకు వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్ తో పెళ్లైంది. తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. లేటు వయసులో ఐదో పెళ్లి చేసుకున్న మర్దోక్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారారు.

Tags:    
  • Mediamogul 
  • Rupertmurdoch 
  • California 
  • Wedding 
  • America 
  • Newyork 
  • Politicalnews 

Similar News

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS