అంబానీ పెళ్లింట్లో చోరీకి విఫలయత్నం.. పరిసర ప్రాంతాల్లో చేతివాటం

64 కళల్లో చోరకళ కూడా ఒకటి. చేతివాటం అలవాటు ఉన్న వారికి చోరీ చేయకపోతే మనసు కుదుట పడదు.

Update: 2024-03-18 04:50 GMT

64 కళల్లో చోరకళ కూడా ఒకటి. చేతివాటం అలవాటు ఉన్న వారికి చోరీ చేయకపోతే మనసు కుదుట పడదు. ఎక్కడైనా సరే చోరీ చేయాల్సిందే. లేకపోతే వారికి చేతి దురద వేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ మహోత్సవంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించాలని యత్నించారు. కానీ భద్రత ఎక్కువగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీ చేసి పోలీసులకు చిక్కారు.

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ జిల్లా జామ్ నగర్ లో ముఖేష్ అంబానీ వివాహం జరుగుతోంది. అక్కడకు కొందరు దొంగలు వచ్చారు. ల్యాప్ టాప్, నగదు చోరీ చేయాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దీంతో వారి చేతి దురద తీర్చుకోవడానికి ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి ల్యాప్ టాప్, నగదు చోరీ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో దొరికిపోయారు.

పోలీసులకు సమాచారం అందడంతో వారు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డయిన ఆధారాల ప్రకారం చోరీకి పాల్పడిన వారిలో జగన్, దీపక్, గుణశేఖర్, మురళి, ఏకాంబరంలను అరెస్ట్ చేశారు. నిందితులు తిరుచ్చి రాంజీనగర్ కు చెందిన వారుగా గుర్తించారు. కట్టుదిట్టమైన భద్రత వల్ల వారు దొంగతనం చేయలేకపోయారు.

దొంగతనం జరిగిన తరువాత వారిని గుర్తించే క్రమంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. వారి ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. చివరకు ఢిల్లీలో వారిని పట్టుకున్నారు. వివాహ వేడుకకు వచ్చి చేతివాటం చూపించిన వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో వారు చోరీకి పాల్పడటం సంచలనం కలిగించింది.

ప్రముఖుల పెళ్లిళ్లలో సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారి వద్ద ఉండే నగదు, వస్తువులు తస్కరించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ దొంగతనం వీలు కాకపోవడంతో ఆ పరిసర ప్రాంతాలను ఎంచుకుని తమ ఆశలు తీర్చుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. దొంగతనం కేసులో వారిని పోలీసులు రిమాండ్ కు పంపి విచారణ సాగిస్తున్నారు.

Tags:    

Similar News