• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పిక్స్‌ వైరల్‌.....

పిక్స్‌ వైరల్‌.. విదేశాల్లో రోజా ఇలాగా!

| ఇటీవల ఎన్నికల్లో రోజా ఓటమిపాలు కావడంతో ఆమె ఎక్కడా కనిపించడం లేదు.

By - Tupaki Desk
Update: 2024-08-06 07:40 GMT

వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని కలలు కన్న ప్రముఖ సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా కలలు కల్లలయిన సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బొటాబాటీ మెజారిటీతో గెలిచిన రోజా ఈసారి ఘోర ఓటమి పాలయ్యారు.


2019 నుంచి 2024 జూన్‌ 3 వరకు ఆర్కే రోజా చక్రం తిప్పారు. తొలి మూడేళ్లు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్‌ పర్సన్‌ గా కేబినెట్‌ మంత్రి హోదాతో పదవిని దక్కించుకున్నారు. చివరి రెండేళ్లు పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.

వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌ గా పేరు తెచ్చుకున్న రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు జైలు పాలయినప్పుడు రోజా బాణసంచా కాల్చి సంబరాలు కూడా జరుపుకోవడం గమనార్హం.

ఇటీవల ఎన్నికల్లో రోజా ఓటమిపాలు కావడంతో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఓటమి పాలయ్యాక ఒకటి రెండు ప్రెస్‌ మీట్లలో మాట్లాడటం మినహా అడ్రస్‌ లేరు. మరోవైపు ఏపీఐఐసీ చైర్‌ పర్సన్‌ గా, పర్యాటక శాఖ మంత్రిగా ఆమె అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి.

మరోవైపు ఆమె గతంలో ఈటీవీలో జబర్దస్త్‌ తోపాటు పలు చానెళ్లలో వివిధ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రోజాకు టీవీ, సినీ రంగం నుంచి అవకాశాలు కూడా రావడం లేదని చెబుతున్నారు.

దీంతో ఇటు రాజకీయాలు, అటు వినోద రంగానికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో రోజా విదేశాల్లో విహరిస్తున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

వెస్ట్రన్‌ డ్రస్సులు ధరించి రోజా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి.  కాగా ప్రస్తుతం రోజా కుమార్తె విదేశాల్లో విద్యనభ్యసిస్తోందని చెబుతున్నారు. ఇంగ్లండ్‌ లో రోజా కూతురు అన్షుమాలిక చదువుతోందని అంటున్నారు. ఆమెను చూడటానికి వెళ్లిన రోజా పనిలో పనిగా విదేశీ విహార యాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారని సమాచారం.

Tags:    
  • Rkroja 
  • ysrcp 
  • Jaganmohanreddy 
  • Foreigntrip 
  • Nagiri 
  • England 
  • Daughter 
  • Janasena 
  • Tdp 
  • Bjp 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS