• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  Visakhapatnam >  అక్కడా 11 శాతం సీట్లే......

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

| సేవ్ విశాఖ అంటూ వైసీపీ బరిలోకి దిగింది. మేయర్ అభ్యర్ధిని ముందుగా ఎంపిక చేసింది. బీసీ సామాజిక వర్గంతో పాటు బలమైన వెలమల నుంచి కూడా మద్దతు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

By - Satya P
Update: 2026-11-05 04:09 GMT

వైసీపీకి రాజకీయంగా కలసి రానిదిగా విశాఖ ఉంది. ఈ నగరం ఎపుడూ వైసీపీని దూరం పెడుతూనే ఉంది. 2014 లో వైసీపీ తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి తాజాగా చూస్తే జీవీఎంసీ ఎన్నికల వరకూ కూడా విశాఖ ప్రతీ సారీ వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. వైసీపీకి ఒక విధంగా వైజాగ్ యాంటీ సెంటిమెంట్ గా మారిపోయింది అని అంటున్నారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పినా కూడా 2024 ఎన్నికల్లో ఒక్క సీటూ ఉమ్మడి జిల్లాలో దక్కలేదని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా తాజా ఎన్నికల్లో కూడా వైసీపీకి కేవలం 11 శాతం మాత్రమే సీటు షేర్ దక్కడంతో సోషల్ మీడియాలో ఇదే ట్రోలింగ్ కంటెంట్ అవుతోంది.

ఎన్ని ఆశలు పెట్టుకున్నా :

సేవ్ విశాఖ అంటూ వైసీపీ బరిలోకి దిగింది. మేయర్ అభ్యర్ధిని ముందుగా ఎంపిక చేసింది. బీసీ సామాజిక వర్గంతో పాటు బలమైన వెలమల నుంచి కూడా మద్దతు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆదికి ముందే అన్ని వార్డులకు అభ్యర్ధులని ప్రకటించి ప్రచారంలోకి దిగారు. మేయర్ ఫేస్ తో కలసి వస్తుందని భావించారు. విశాఖ నీటి కష్టాలు అన్నారు, భూ పందేరాలు అని విమర్శించారు. విశాఖను అమ్మేస్తారు అని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇలా ఎన్ని చేసినా కూడా వైసీపీకి కనీస స్థాయిలో సీట్లను కూడా జనాలు కట్టబెట్టలేదు.

టోటల్ గా అక్కడే :

ఇక విశాఖ కార్పోరేషన్ లో చూస్తే మొత్తం 120 వార్డులు ఉంటే అందులో వైసీపీ గెలిచింది 13 సీట్లు మాత్రమే. అంటే కచ్చితంగా 11 శాతం సీట్లే మళ్లీ వైసీపీకి జనాలు ఇచ్చారు అని ప్రత్యర్ధులు సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తున్నారు. వైసీపీకి ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే దక్కాయి. దానినే దృష్టిలో ఉంచుకుని విశాఖలోనూ అదే జరిగింది అని అంటున్నారు. అంతే కాదు విశాఖలో వైసీపీకి చాన్స్ లేదని కూటమి నేతలు మరోసారి స్పష్టం చేస్తున్నారు.

మొదటి నుంచీ అంతే :

ఇక కాస్తా వెనక్కి వెళ్తే 2014లో తొలిసారి వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటే విశాఖ ఎంపీ సీటుకు జగన్ తల్లి విజయమ్మ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్ష ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలు అయ్యారు. అంతే కాదు విశాఖ నగర పరిధితో పాటు రూరల్ జిల్లాలో కూడా ఎక్కడా ఒక్క సీటు దక్కలేదు, ఏజెన్సీలో రెండు సీట్లు మాడుగులలో ఒక సీటుతో వైసీపీ సరిపెట్టుకుంది. ఇక 2019లో జగన్ ప్రభంజనం వీచినా విశాఖలోని నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుంది. 2024లో అయితే మొత్తానికి మొత్తం స్వీప్ చేసి పారేసింది. ఇపుడు చూస్తే మరోసారి కూటమి ప్రభంజనం సాగింది. 2021లో వైసీపీ గెలిచినా దక్కినవి 58 సీట్లే అని గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 30 దాకా వార్డులు గెలిచి గట్టి ప్రతిపక్షంగా నిలబడింది అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే విశాఖ సాగర తీరం వైసీపీకి ఎంతో దూరం అనే అంటున్నారు. మరి ఎందుచేత ఏమిటి అన్నది పక్కన పెడితే వైసీపీకి కూడా సరైన నాయకత్వం విశాఖ జిల్లాలో లేకపోవడం అనేక నియోజకవర్గాలలో బలహీనమైన ఇంచార్జిలు ఉండడం కూడా ఇతర కారణాలుగా చెబుతున్నారు.

Tags:    
  • ysrcp 
  • ysjagan 
  • visakhapatnam 
  • gvmcelections 
  • andhrapradeshpolitics 

Similar News

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

విశాఖ ఓటర్ కి ఏమైంది...సగం తీర్పుగానే !

2026-11-02 03:45 GMT

బాలయ్య కూతురు అన్ని అనుమానాలు పటాపంచలు చేసింది.. సర్ ప్రైజ్ ఇచ్చేసింది..

2026-11-01 12:18 GMT

ఇరు పార్టీల‌దీ 'సేవ్ విశాఖ‌' ప్ర‌చార‌మే.. !

2026-10-31 08:02 GMT

విశాఖ విజయవాడ.... హీటెక్కించే రిజల్ట్స్ !

2026-10-30 19:30 GMT

బిగ్ డిబేట్‌: వైసీపీ... ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వృద్ధుల పార్టీనా.. ?

2026-10-27 17:30 GMT

విశాఖ మేయర్ సీటు...ఇద్దరి మధ్యనే పోటీ !

2026-10-25 15:03 GMT

టీడీపీని టెన్షన్ పెడుతున్న పల్లా సిస్టర్ !

2026-10-20 03:16 GMT

విశాఖ మేయర్ కోసం భారీగానే !

2026-10-19 03:34 GMT

Copyright @2026

Powered by Blink CMS