• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  డిప్యూటీ మేయర్లు...వైఎస్...

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

| పట్టణ పురపాల సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు వార్డులకు కౌన్సిలర్లను కార్పోరేషన్లను ఎన్నుకున్నారు.

By - Satya P
Update: 2026-11-05 04:10 GMT

ఏపీలో ఈ నెల 1న జరిగిన 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వచ్చేశాయి. మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు ఎవరు అన్నది తేలిపోయింది. ఇక అందరి దృష్టి డిప్యూటీ మేయర్లు, వైఎస్ చైర్మన్ల మీద పడింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. దాన్ ప్రకారం చూస్తే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 18వ తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారు. అనంతరం 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నుకునేది వీరే :

పట్టణ పురపాల సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు వార్డులకు కౌన్సిలర్లను కార్పోరేషన్లను ఎన్నుకున్నారు. వీరే ఈ నెల 23న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వైస్ చైర్‌పర్సన్ లను, మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు చైర్‌పర్సన్‌లు, మేయర్‌ లు ఎన్నికైన ఒక వార్డు సభ్యున్ని డిప్యూటీ మేయర్ గా అలాగే వైస్ చైర్‌పర్సన్ గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా నిర్ణీత తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేసి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.

పూర్తి చేయాల్సిందే :

ఇక ఏదైనా అనివార్య కారణాల వల్ల నవంబర్ 23 వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించకపోతే ఆ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 24 తేదీన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ షెడ్యూల్ కీలకంగా మారనుందని ఈ ఎన్నికలతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియ మరింత ముందుకు సాగనుందని తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల ప్రక్రియలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాంతో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల హడావుడి ప్రారంభం అయినట్లే అంటున్నారు. ఇందులో కూడా కూటమి పార్టీలు మూడూ కలసి ఎవరికి చాన్స్ ఇస్తాయో, ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కుతాయో వేచి చూడాల్సి ఉంది. విజయవాడ డిప్యూటీ మేయర్ టీడీపీ తీసుకుంటుందని ప్రచారంలో ఉంది. అలాగే విశాఖ డిప్యూటీ మేయర్ మీద మిత్రులు పట్టు పడుతున్నారు. ఇతర చోట్ల కూడా పోటీ గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    
  • andhrapradesh 
  • apolitics 
  • deputymayor 
  • tdp 
  • janasena 

Similar News

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS