రంగనాథ్ తొలగింపుపై రేవంత్ హాట్ కామెంట్స్ !

దేశంలోనే హైడ్రా వ్యవస్థ గేటెస్ట్ అని తెలంగాణా ముఖ్యమంత్రి రేవన్ రెడ్డి గట్టిగా చెప్పారు. హైడ్రా ఎన్నో మంచి పనులు చేసింది అన్నారు తమ ప్రభుత్వం తీసుకుని వచ్చిన అద్భుతమైన సంస్కరణలలో హైడ్రా చాలా గొప్పది అని ఆయన అన్నారు

Update: 2026-07-28 17:49 GMT

దేశంలోనే హైడ్రా వ్యవస్థ గ్రేటెస్ట్ అని తెలంగాణా ముఖ్యమంత్రి రేవన్ రెడ్డి గట్టిగా చెప్పారు. హైడ్రా ఎన్నో మంచి పనులు చేసింది అన్నారు తమ ప్రభుత్వం తీసుకుని వచ్చిన అద్భుతమైన సంస్కరణలలో హైడ్రా చాలా గొప్పది అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే హైడ్రా కమిషనర్ రంగనాధ్ తొలగింపు మీద హైకోర్టు చేసిన కామెంట్స్ కి సంచలనంగా మారాయి. అయితే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్షన్ కూడా ఇపుడు వైరల్ అవుతోంది. ఆయన హైడ్రా ఆలోచన గొప్పదని స్ట్రాంగ్ గా మాట్లాడడమే కాదు ఏ అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారం అని ఆయన అన్నారు. ఆ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరని అన్నారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు :

మరో వైపు చూస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులు విధులలో నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రంగనాథ్‌పై దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఒకే పిటిషన్‌లో కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించింది. సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది. రంగనాథ్ స్థానంలో మరో అర్హత గల ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని సీఎస్‌ను ఆదేశించింది.

కబ్జా కోర్ల భరతం పట్టేందుకే :

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ప్రభుత్వ వాదన ఏంటో చెప్పారు. తాము హైడ్రా తీసుకుని వచ్చింది ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికే అని అన్నారు. చెరువులను గుంటలను కబ్జా చేసే కబ్జాకోర్లకే దీని వల్ల నష్టం అని చెప్పారు. పార్కులను ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిని చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులతోనే బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయని అన్నారు. వీటిని న్యాయ స్థానాలలోనే ఎదుర్కొంటామని ఆయన అన్నారు.

బడా బాబులకే దడ :

తాము కూలగొట్టేది బడా బాబులు ఎవరైనా కబ్జాలు ఎక్కడ చేస్తే వాటిని కూలగొడతామని అన్నారు. హైడ్రా పుట్టిందే అందుకోసమని అన్నారు. అంతే తప్ప న్యాయబద్ధంగా ఎందరో బడా బాబులు భవనాలు కట్టుకుంటే హైడ్రా కూలుస్తుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను కాలువలను కబ్జా చేస్తే ఊరుకోమని అన్నారు. హైడ్రా వీటి మీదనే ఫోకస్ పెడుతుందని ఆయన అన్నారు. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించి కోర్టులో కేసులు వేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దాని పేరే బతుకమ్మ కుంట అని అలాంటిది ఆక్రమించేసి ఈ విధంగా చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. బతుకమ్మ కుంటను ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆయన చెప్పారు. దాని మీద కూడా ఈ రోజు కేసు నడుస్తోంది అని అన్నారు. వీటిని ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు. మరో కబ్జా కోరు వందల ఎకరాలను ఆక్రమించారని వారిని ఏ విధంగా చూడాలని ఆయన నిలదీశారు.

ప్రభుత్వానికి సహకరించాలి :

హైడ్రా ప్రభుత్వ భూములను కాపాడుతోందని అది ఎవరికీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. మీడియా కూడా ఈ విషయంలో సహకరించాలని ఆయన కోరారు. కబ్జాదారులను కాపాడడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో కూడా అలాగే ప్రచారం చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తాము తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. హైడ్రాను పని చేయనివ్వండని ఆయన కోరారు.

Tags:    

Similar News