• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉత్తరాంధ్రను...

ఉత్తరాంధ్రను వణికించబోతున్న ఆర్నబ్ !

| ఆర్నబ్ అంటే బెంగాలీ భాషలో మహా సముద్రం అని అర్థం. అంటే ఒక సముద్రం మాదిరిగా ఆర్నబ్ తుపాను తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు అన్న మాట.

By - Satya P
Update: 2026-09-18 07:58 GMT

ఈ సీజన్ లో ఇదే తొలి తుపాను. ఇప్పటిదాకా అల్ప పీడనాలతోనే సీజన్ సరిపోయింది. ఎల్ నినో ప్రభావంతో అల్ప పీడనాలు కూడా వర్షాలను ఎక్కువగా కురిపించ లేకపోయాయి. కానీ ఇపుడు మొదటి తుపాను రూపు దిద్దుకోనుంది. ఇది అరవీర తీవ్రంగానే తన ప్రతాపం చూపిస్తుంది అని అంటున్నారు. దీని తాకిడికి ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు ఒడిషాలోని కొన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయని అంటున్నారు. ఈ తుపాను తీవ్రంగా బలపడితే దానికి ఆర్నబ్ అన్న పేరుని పెట్టాలని అనుకుంటున్నారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరుగా ఉంది. ఆర్నబ్ అంటే బెంగాలీ భాషలో మహా సముద్రం అని అర్థం. అంటే ఒక సముద్రం మాదిరిగా ఆర్నబ్ తుపాను తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు అన్న మాట.

ఈ నెల 20న తరువాత :

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన ఒక బలమైన వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం సముద్రంలో నెలకొన్న అనువైన పరిస్థితుల వల్ల ఈ వాయుగుండం మరింతగా బలపడి తుపానుగా పరివర్తన చెందే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ పెను తుపాను కనుక ఏర్పడి దూసుకుని వస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్రా జిల్లాల మీదనే ఉండబోతోంది అని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు అంచనా కడుతున్నాయి. ఈ తుపాను మీద ఈ అంచనా అయితే ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితులు ఈ వాయుగుండం తీవ్ర తుపానుగా మారేందుకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నాయని అంటున్నారు. వీటికి ఎల్ నినో పరిస్థితులు వేడి గాలులు కనుక తోడు అయిన పక్షంలో ఆర్నబ్ ఒక సాధారణ తుఫాన్ స్థాయి నుంచి భారీ తుపాన్ గా రూపాంతరం చెందుతుందని అంచనాలు అయితే ఉన్నాయి.

ఆర్నబ్ గమనం చూస్తే :

ఇక ఈ భారీ తుపాను గా మారే క్రమంలో ఆర్నబ్ తూర్పు తీరం వైపు వేగంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రా పశ్చిమ ఒడిషాల మధ్యలో ఈ భారీ తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ నెల 20 నుంచే ఒడిశా ఉత్తరాంధ్రా జిల్లాలలో భారీగా వానలు కురిసే అవకాశం ఉంది. ఇక 21, 22 తేదీలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలే పడుతాయని అంచ్న వేస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలలో ఇది తీవ్రంగానే ఉండొచ్చు అని అంటున్నారు.

ఒక విధంగా వరంగా :

గత కొన్ని నెలలుగా నైరుతి సీజన్ ఉన్నా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో ఉత్తరాంధ్రా జిల్లాలు ఉన్నాయి. దాంతో ఆర్నబ్ వంటి భారీ తుపాన్ సంభవిస్తే పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ భారీ తుపాను కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రంలోనూ అనేక జిల్లాలకు వర్షాలను తీసుకుని వస్తుందని అంటున్నారు. అడుగంటిన భూగర్భ జలాలతో అల్ల్లాడుతున్న జనాలకు ఈ విధంగా వర్షాలతో ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ఆర్నాబ్ తుపాన్ విషయంలో ఆందోళనకరమైన అంచనాలు ఉన్నప్పటికీ భారీ వానలు కురిస్తే అదే పది వేలు అన్నదే అంతా అంటున్నారు.

Tags:    
  • cyclonearnab 
  • bayofbengal 
  • andhrapradeshweather 
  • northandhra 
  • odishaweather 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS