మాచర్లలో రీ పోలింగ్ ?

మే 13న పోలింగ్ జరిగిన వారం రోజులకు మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లో ఆవేశంతో ద్వంసం చేసిన వీడియో క్లిప్ బయటకు వచ్చింది.

Update: 2024-05-22 14:58 GMT

ఏపీలో జరుగుతున్న భీకర పోరుతో కూడిన రాజకీయం అనూహ్య పరిణామాలకు దారి తీస్తోంది. మే 13న పోలింగ్ జరిగిన వారం రోజులకు మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లో ఆవేశంతో ద్వంసం చేసిన వీడియో క్లిప్ బయటకు వచ్చింది. వెబ్ కాస్టింగ్ తో సమస్యాత్మక గ్రామాలలో పోలింగ్ నిర్వహించారు. లైఫ్ లోనే ఇదంతా కెమెరా రికార్డింగ్ జరిగింది.

అయితే వారం రోజుల తరువాత ఇలా బయటకు రావడం ఒక విశేషం అయితే దాని ముందూ వెనకా జరిగిన ఘటనలను కూడా వీడియో రికార్డింగులు బయటపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్క చోటనే వీడియో బయటకు రావడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఈసీ కంట్రోల్ లో వెబ్ కాస్టింగ్ చేసిన వీడియోలు భద్రంగా ఉండాల్సింది టీడీపీ సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొట్టాయని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే ఈవీఎం ని ద్వంసం చేస్తే అది చాలా దారుణమైన విషయం. సాధారణంగా ఆయా పార్టీల క్యాడర్ ఇలాంటి పనులు చేస్తూంటారు.

కానీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇలా చేశారు అంటే ఇది సీరియస్ వ్యవహారంగానే చూడాలి. అయితే జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూడం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవీఎం ధ్వంసం చేసిన తరువాత కూడా ఎమ్మెల్యే తన ఊర్లో ఉన్నారని అంటున్నారు. అంతే కాదు ఆయన పోలింగ్ ముగిసిన తరువాత కొన్నాళ్ళ పాటు అక్కడే ఉన్నా ఎందుకు చర్యలు లేవు అన్నది మరో చర్చగా ఉంది.

Read more!

ఇవన్నీ పక్కన పెడితే మాచర్ల అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించినపుడు పోలీస్ బలగాలు ఏమి చేస్తున్నాయన్నది కీలక ప్రశ్నగా ఉంది. పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా దర్జాగా వెళ్ళి మరీ ఈవీఎంలను బద్ధలు కొట్టడాన్ని ఎలా చూడాలని అంటున్నారు.

ఇక మాచర్లలో రీ పోలింగ్ కి టీడీపీ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాచర్ల వైసీపీకి కంచుకోట లాంటి సీటు. 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో కలుపుకుని పిన్నెల్లి నాలుగు సార్లు గెలిచారు. ఈసారి కూడా ఆయన గెలుస్తారు అని అంటున్నారు. ఇక ఆయన ఈవీఎం ని బద్ధలు కొట్టిన పోలింగ్ స్టేషన్ పరిధి అంతా కూడా టీడీపీకి పట్టున్న ప్రాంతం అని అంటున్నారు. అక్కడ రిగ్గింగ్ చేశారు అని తెలిసి ఆయన వెళ్ళి అలా చేశారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఏది ఏమైనా మాచర్లలో రీపోలింగ్ మొత్తం నియోజకవర్గంలో నిర్వహిస్తారా లేక కేవలం అల్లర్లు జరిగిన పోలింగ్ బూత్ లల్లో నిర్వహిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే ఈసీ ఈ విషయంలో సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. అందువల్ల కఠిన నిర్ణయాలు దిశగానే చర్యలు ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News