రాపాక సైకిల్ కి బ్రేకులేయడానికి ఆ పార్టీ రెడీ ?

రాపాక వర ప్రసాదరావు ఈ పేరు రాజకీయాల మీద కాస్తా అవగాహన ఉన్న వారికి గుర్తుండే ఉంటుంది.;

Update: 2026-04-03 05:30 GMT

రాపాక వర ప్రసాదరావు ఈ పేరు రాజకీయాల మీద కాస్తా అవగాహన ఉన్న వారికి గుర్తుండే ఉంటుంది. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే. అలా స్టేట్ వైడ్ లో టాక్ అయిపోయారు అంతే కాదు జనసేన నుంచి వైసీపీలోకి జంప్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక వైసీపీలో పనిచేసి తిరిగి ఆ పార్టీకి దండం పెట్టి దూరం జరిగారు. ప్రస్తుతం రాపాక సార్ ఏమి చేస్తున్నారు అంటే ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారు అని అనుచరుల నుంచి వస్తున్న మాటగా ఉంది.

టీడీపీ వైపు చూపు :

రాపాక వర ప్రసాదరావు కాంగ్రెస్ నుంచి 2009 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. ఆయన వైసీపీలోకి తరువాత వచ్చినా 2014లో టికెట్ దక్కలేదు. దాంతో ఆయన జనసేనలో చేరారు. 2019లో ఆయన ప్రయత్నం ఫలించి మరోసారి నెగ్గారు. అయితే ఇపుడు ఆయన పూర్తిగా డైలామాలో ఉన్నారని అంటున్నారు. వైసీపీకి దూరం అయిన ఆయన జనసేనతోనూ అదే గ్యాప్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. దాంతో ఆయన చూపు టీడీపీ మీదనే ఉంది అని అంటున్నారు. ఆయన చేరేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అందుకే ఆయన టీడీపీకి చెందిన నాయకులతో టచ్ లోకి వస్తున్నారట. వారితో కలసి తన మనసులో మాటను చెబుతున్నారని ప్రచారం సాగుతోంది.

జనసేన సీటుగా :

ఇక 2024 ఎన్నికల్లో పట్టుబట్టి రాజోలు సీటు తీసుకున్న జనసేన మరోసారి అక్కడ గెలిచి జెండా పాతింది. ఇపుడు జనసేన టీడీపీ కూటమిలో కలసి ఉన్నాయి. రాపాక కనుక మిత్ర పక్షం పార్టీగా టీడీపీలో చేరుతామని అనుకున్నా సాగేది కుదిరేది ఉండదని జనసేన నుంచి వస్తున్న రియాక్షన్ గా ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే రాపాక జనసేన నుంచి గెలిచి ఆ పార్టీని ఏ విధంగా దెబ్బ తీశారు అన్నది క్యాడర్ మరచిపోలేకపోతోందిట. అంతే కాదు అధినేత పవన్ మీద ఆయన విమర్శలు చేశారని అవన్నీ గుర్తు ఉన్నాయని కూడా చెబుతున్నారు. దాంతో ఆయన సైకిలెక్కుతామని అంటే కనుక బ్రేకులేసేందుకు తాము రెడీ అని జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

జరిగేది కాదు :

ఇక కూటమిలోని ఏ పార్టీలో అయినా నాయకులు చేరాలీ అంటే వివాదం లేకపోతే ఫరవాలేదు, అభ్యంతరం ఉంటే కనుక కచ్చితంగా పరిశీలించి వద్దు అని మిత్రులు చెబితే ఆగిపోవడం జరుగుతోంది. ఈ మేరకు ఒక అవగాహన అయితే కూటమి పార్టీల మధ్య ఉంది అని అంటున్నారు. అందువల్ల టీడీపీకి స్థానికంగా ఇబ్బందులు ఉంటే కనుక రాపాకను చేర్చుకోవడం జరగదని అంటున్నారు. అయితే రాజోలు టీడీపీకి మంచి నాయకత్వం కావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఆ లోటుని తాను భర్తీ చేస్తాను అని రాపాక అంటున్నా టీడీపీ ఆయనను చేరదీస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా రాపాక రాజకీయ దారి రాదారి కాదనే అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏదైనా ప్రముఖ పార్టీలో చేరితేనే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News