రన్యాతో కాపురం చేయలేను.. విడాకులు ఇప్పించండి

దుబాయ్ నుంచి భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి రన్యారావు గురించి తెలిసిందే.;

Update: 2025-04-03 04:59 GMT

దుబాయ్ నుంచి భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి రన్యారావు గురించి తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆమె భర్త కోర్టును కోరేందుకు వీలుగా ప్రయత్నాలు షురూ చేశారు. ఇందుకు తగ్గట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రన్యారావుతో వ్యాపారి జతిన్ హుక్కురి 2024లో పెళ్లైంది. ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా 2024 అక్టోబరు ఆరున ఒక రెస్టారెంట్ లో తామిద్దరం తొలిసారి కలిసినట్లుగా పేర్కొన్నారు. అనంతరం తామిద్దరం మాట్లాడుకొని అదే నెలలో ఎంగేజ్ మెంట్.. నవంబరులో పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడించారు.

గత ఏడాది నవంబరు 27న తమకు పెళ్లైందని.. ల్యావెల్లీ రోడ్డులోని ఒక విలాసవంతమైన ఫ్లాట్ లో వీరు సంసారాన్ని షురూ చేశారు. అయితే.. పెళ్లైన నెల రోజులకే తమ మధ్య విభేదాలు వచ్చినట్లుగా అతను చెబుతున్నారు. తాను ఎంత వద్దని చెప్పినా.. పని ఉందని.. బిజినెస్ చూసుకోవాలంటూ ప్రతిసారీ దుబాయ్ కు వెళ్లి వచ్చేదని.. దీంతో తాను విసిగిపోయి.. ఆమె నుంచి దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.

వద్దని చెప్పినా వినకుండా తరచూ విదేశీ ప్రయాణాలు చేయటంతో తాను.. ఆమెతో కలిసి ఉండటం లేదని చెప్పారు. మార్చి 2న అర్థరాత్రి వేళ రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె చేస్తున్న అక్రమ బంగారు వ్యాపారం గురించి వివరాలు వెలుగు చూశాయి. బంగారం స్మగ్లింగ్ లో రన్యారావు భర్త ప్రమేయం లేదని తేలిన తర్వాత అతడు కేసు నుంచి బయటపడిప్పటికి.. ఆమెతో కలిసి ఉండడటం సాధ్యం కాదని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది సాయంతో విడాకులకు కోర్టును ఆశ్రయించనున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News