• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎయిర్ పోర్టులో 14.8 కేజీల...

ఎయిర్ పోర్టులో 14.8 కేజీల బంగారం పట్టివేత.. సినీ నటి అరెస్ట్

| బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

By - Tupaki Desk
Update: 2025-03-05 05:28 GMT

బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు వద్ద నుంచి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు.

- తరుచుగా దుబాయ్ ప్రయాణాలు.. అధికారులు అనుమానం

రన్యా రావు ఇటీవల తరచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నారని అధికారులు గుర్తించారు. గత 15 రోజుల్లోనే 4 సార్లు ఆమె దుబాయ్ వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచిన అధికారులు ఎయిర్ పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు.

-అధిక మొత్తంలో బంగారం పట్టివేత

రన్యా రావు లగేజీని పరిశీలించగా 14.8 కిలోల బంగారం దొరికినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తగిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై DRI బృందం ముమ్మరంగా విచారణ చేపట్టింది. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రన్యా రావుకు ఎవరైనా సహకరించారా? మరో పెద్ద ముఠా ఉన్నదా? అనే కోణంలో అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

-రన్యా రావు ఎవరు?

రన్యా రావు కన్నడ చిత్రసీమలో నటిగా గుర్తింపు పొందారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆమె 'మాస్టర్ పీస్', 'చంద్రిక', వాఘా , పటాకీ వంటి చిత్రాల్లో నటించారు. అయితే, ఆమెకు స్మగ్లింగ్ సంబంధం ఉందా? లేక కేవలం ఎవరైనా ఇరికించారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నటిపై అనుమానంతో ఆమెను అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    
  • Kannadaactress 
  • RanyaRao 
  • Ranyaraoarrested 
  • BengaluruAirport 
  • DRI 
  • Ranyaraoarrest 
  • Goldsmuggling 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS