మంత్ ఆఫ్ ఆగస్ట్ హీరో ఎవరు...రాహుల్ వర్సెస్ మోడీ !

జాతీయ రాజకీయాలు ఆగస్ట్ నెలలో ఎన్నో మలుపులు తిరిగాయి. భారీ ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి.;

Update: 2025-08-26 16:30 GMT

జాతీయ రాజకీయాలు ఆగస్ట్ నెలలో ఎన్నో మలుపులు తిరిగాయి. భారీ ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. నిజానికి ఆగస్ట్ నెల అంటేనే చాలా ఉంటుంది. దేశానికి స్వాతంతం వచ్చిన రోజు కూడా ఇదే నెలలో ఉంది. అంతే కాదు ఈసారి వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. మరో వైపు ఉప రాష్టపతి పదవికి ఎన్నికలు అనివార్యంగా తోసుకుని వచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. ఆయన బీహార్ లో ఓట్ అధికార్ యాత్రను చేపట్టారు. దాంతో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా రాజకీయ సమరానికి తెర లేచింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆగస్ట్ లో ఎవరు హైలెట్ అయ్యారు, ఎవరు హీరోగా ఈ మంత్ లో నిలిచారు అన్నది ఇపుడు అంతటా సాగుతున్న చర్చగా ఉంది.

అంతా రాహుల్ మయం :

ఈ ఆగస్ట్ నెల రాహుల్ గాంధీకి బాగా కలిసి వచ్చింది అని అంటున్నారు. ఆయన పార్లమెంట్ లోపలా బయటా తన అసలైన ఫైర్ ఏమిటో చూపించారు. పార్లమెంట్ లో బీహార్ లో ప్రత్యేక ఓటర్ల సవరణ మీద కూడా ఆయన గట్టిగానే మాట్లాడారు. అలా అధికార ఎన్డీయేని నిలదీశారు. ఈ ఇష్యూ మీద మొత్తం విపక్షాలు అన్నీ ఏకతాటి మీద నిలిచేలా చేయడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. మరో వైపు చూస్తే ఆగస్ట్ నెలలో సరిగ్గా 7వ తేదీన ఆయన ఈసీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓట్ల గల్లంతు ఎలా దేశంలో జరిగిందో తమ పార్టీ తరఫున ఆరోపణలు చేస్తూ సంచలనం రేపారు.

దేశంలో బిగ్ డిబేట్ :

ఈ విధంగా రాహుల్ గాంధీ ఈసీ ఎన్నికల నిర్వహణ విషయంలో పలు తప్పిదాలు చేసిందని కర్ణాటక, మహారాష్ట్ర హర్యానాలో ఫలితాలలో తేడాలు ఉన్నాయని భారీ ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో తప్పుడు తడకలు ఉన్నాయని అన్నారు. అధికార బీజేపీకి సహకరించేలా ఈసీ విధానాలు ఉన్నాయని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదహరిస్తూ ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ దేశంలో బిగ్ డిబేట్ సాగేలా చేసింది. అలా అంతా రాహుల్ గాంధీని తలచుకునేలాగానే ఈ మొత్తం పరిణామాలు కనిపించాయి.

పని చేయని బీజేపీ ట్రోల్స్ :

ఇక రాహుల్ గాంధీ అతి పెద్ద రాజకీయ అస్త్రంతో పటిష్టంగా ఉందనుకున్న ఎన్డీయే ప్రభుత్వం మీద శర సంధానమే చేశారు. ఓటు చోరీ అంటూ ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు మెయిన్ స్ట్రీం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ కలకలం రేపాయి మొత్తంగా వైరల్ అయ్యాయి. అలా రాహుల్ గాంధీ సూపర్ హైలెట్ అయ్యారు మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఈసీ తొలిసారిగా ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించింది. అలాగే బీజేపీ దిగ్గజ నేతలు కూడా రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా బీజేపీ వాళ్ళు ట్రోల్స్ చేసినా పెద్దగా లాభం లేకుండా పోయింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టింగులు కనిపించడమూ ఒక విశేషంగా మారింది

ట్రెండింగ్ లో రాహుల్ :

ఇక చూస్తే మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా సోషల్ మీడియాలో అంతా డిబేట్ సాగుతోంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెబుతూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ బాగుందని అంతా అంటున్నారు. అదే సమయంలో రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణల మీద ఈసీ ఇచ్చిన వివరణ కానీ ఖండన కానీ దేశ ప్రజల పూర్తి అనుమానాలను నివృత్తి చేయలేకపోయింది అని అంటున్నారు. దాంతో రాహుల్ చెప్పిన దాంట్లో నిజం ఉందా అన్న దిశగా జనాలు ఆలోచించడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. అలా సోషల్ మీడియాలో ఈ ఆగస్టు నెల అంతా రాహుల్ గాంధీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారని అంటున్నారు.

మోడీ వెనకబడ్డారా :

మామూలుగా అయితే సోషల్ మీడియాలో ఎపుడూ నరేంద్ర మోడీ హైలెట్ గా నిలుస్తూ వస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా పరివార్ పవర్ ఫుల్ గా ఉంటుంది. దాంతో మోడీ ఏమి చేసినా అది క్షణాలలో వైరల్ అవుతుంది అదే విధనా మోడీ గురించి కూడా ఎపుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే ఈసారి చిత్రంగా మోడీని సోషల్ మీడియా వార్ లో రాహుల్ గాంధీ అధిగమించారు అని అంటున్నారు. అలా ఫస్ట్ టైం రాహుల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ ఫేవరేట్ గా మారిపోయారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే మోడీ తన విదేశీ పర్యటనలు తన కార్యక్రమాల ద్వారానే ఎపుడూ సోషల్ మీడియాకు కంటెంట్ ఇస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ఒక ఇష్యూఇ బేస్ చేసుకుని రాహుల్ జనంలోకి వెళ్తున్న తీరు మీడియాను అడ్రస్ చేస్తున్న తీరుతో మోడీని మించి ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ బీహార్ పర్యటన మీద ఆయన అక్కడ ఇస్తున్న ప్రసంగాల మీద కూడా జనాలకు ఆసక్తి పెరుగుతోంది అంటే రాహుల్ గ్రాఫ్ ఒక్క సారిగా పెద్ద ఎత్తున పెరిగింది అని అంటున్నారు అది కూడా ఆగస్ట్ నెలలోనే అమాంతం పెరిగింది అని అంటున్నారు. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున నిలబెట్టిన అభ్యర్ధి వారి ఫిలాసఫీ కూడా జనంలో చర్చకు వస్తోంది. మొత్తానికి రాహుల్ ఆగస్ట్ నెలలో హీరో అయ్యారనే అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఈ దూకుడు ఏ తీరున సాగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News