మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2024... ఇండియన్ మోడల్ కు బిగ్ షాక్!

అవును... మోడల్ రాచెల్ గుప్తా బుధవారం సోషల్ మీడియా వేదికగా తన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ - 2024 టైటిల్ కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.;

Update: 2025-05-28 16:01 GMT

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ - 2024, ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్ ను వదులుకున్నట్లు ప్రకటించింది. అయితే... ఈ లోపు నిర్వాహకులు ఆమెను అధికారికంగా తొలగించినట్లు ప్రకటించారు. దీంతో.. వివాదం చెలరేగింది. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... మోడల్ రాచెల్ గుప్తా బుధవారం సోషల్ మీడియా వేదికగా తన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ - 2024 టైటిల్ కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా పోస్టులో.. తాను విషపూరిత వాతావరణానికి గురయ్యానని.. పదే పదే హామీలు నెరవేర్చలేదని.. రాజీనామా నిర్ణయం కష్టమైనదే కానీ అవసరమని ఆమె అన్నారు!

ఈ సందర్భంగా తన పోస్టులో.. పూర్తి విషయాన్ని త్వరలో ఓ వీడియోలో పంచుకుంటానని.. 'నిజం అతి త్వరలో బయటకు వస్తుంది' అంటూ తన క్యాప్షన్ లో జోడించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులందరినీ నిరాశపరిచినట్లయితే క్షమించాలని.. తన నిర్ణయ సరైన ఎంపిక అని అర్ధం చేసుకోవాలని కోరారు.

దీనిపై స్పందించిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్... రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ - 2024 టైటిల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. 30 రోజుల్లోపు ఆమె తన కిరీటాన్ని ఎంజీఐ ప్రధాన కార్యాలయంలో తిరిగి ఇవ్వాలని కోరింది.

కాగా... గత ఏడాది అక్టోబర్ 25న రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ - 2024 కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది. ఈ విజయం ఆమెకు గ్రాండ్ పేజెంట్ ఛాయిస్ అవార్డును కూడా సంపాదించిపెట్టింది.

Tags:    

Similar News