పీవీ రమేష్ కి క్లారిటీ ఇచ్చిన అధికారులు... వైరల్ గా నెటిజన్ల కామెంట్లు!

వివరాళ్లోకి వెళ్తే... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ సమయంలో పీవీ రమేష్‌ ఒక ట్వీట్ పెట్టారు!

Update: 2024-05-06 14:57 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో ఇంకా అమలులోకి రాని ఒక చట్టం గురించిన చర్చలతో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ చట్టం గొప్పతనాన్ని అసెంబ్లీలో అంగీకరించిన టీడీపీ నేతలు.. తాజాగా ఇప్పుడు మాత్రం తప్పుపడుతున్నారు! దీంతో... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సమయలో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన సమస్యకు అధికారులు వివరణ ఇవ్వడంతో వ్యవహారం బౌన్స్ బ్యాక్ అయ్యింది అనే కామెంట్లకు కారణమవుతుంది!

అవును... ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ను అడ్డుపెట్టుకుని జగన్‌ ను దెబ్బతీసేందుకు విపక్షాలు శతవిధాలుగా ప్రయత్నిస్తోన్నాయని.. దీనికి వారి అనుకూల మీడియా తోడైందని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... తాజాగా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సమయంలో ముందుగా ట్వీట్ చేసి, తర్వాత కరెక్ట్ చేసిన ఈ ట్వీట్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఆయన ఆరోపణల్లోని వాస్తవ శాతంపై స్థానిక రెవిన్యూ అధికారులు రియాక్ట్ అయ్యారు.

Read more!

వివరాళ్లోకి వెళ్తే... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ సమయంలో పీవీ రమేష్‌ ఒక ట్వీట్ పెట్టారు! ఇందులో భాగంగా... "నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ప్రత్యక్ష బాధితుడిని.. కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం." అని ట్వీట్ చేశారు!

దీంతో... "అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారు?" అంటూ ఆన్ లైన్ వేదికగా ఎదురు ప్రశ్నలు లేవనెత్తారట పలువురు నెటిజన్లు! అదే కారణమో ఏమో కానీ... వెంటనే ట్వీట్‌ ను ఎడిట్ చేసేశారు. అలా ఎడిట్ చేసిన ట్వీట్‌ లో "చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి." అనే లైన్ జత చేశారు. దీనిపైనా రియాక్ట్ అయిన నెటిజన్లు... చట్టం అమలులోకి రాకముందు విషయాలపైనా విమర్శలేనా అనే కామెంట్లు చేశారు!

4

ఈ సమయంలో రెవిన్యూ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... సదరు 11 ఎకరాల 14 సెంట్ల భూమిని ముగ్గురు అన్నదమ్ములు పంచుకొనవలసి ఉండగా, వీలునామాలో ఏ భాగం ఎవరికి విభజించాలో సర్వే నంబర్ వివరాలు రాయలేదని.. అలా వివరాలు వీలునామాలో రాయకపోయినా ముగ్గురు అన్నదమ్ములు పారీకత్తు రాసుకుని మ్యూటేషన్ కొరకు సమర్పించి ఉండాలని.. అదీ జరగలేదని వెల్లడించారు. దరఖాస్తును కేవలం డాక్టర్ పివి రమేష్ మాత్రమే చేశారని తెలిపారు.

మరోపక్క... బురదజల్లే తొందరలో.. టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ పై తప్పుడు ప్రచారం చేసేందుకు పీవీ రమేష్‌ (మాజీ ఐఏఎస్)ని చంద్రబాబు రంగంలోకి దించారని.. ఆ యాక్ట్‌ తో తాను బాధితుడ్ని అంటూ పీవీ కలరింగ్ ఇచ్చినా.. విచారణలో పీవీ ఫ్యామిలీ ఆ భూమిని దౌర్జన్యంగా కబ్జా చేసినట్లు వెలుగులోకి వచ్చిందని వైసీపీ ట్వీట్ చేసింది.

ఈ నేపథ్యంలో... పీవీ రమేష్ చేసిన ట్వీట్స్ కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి!! ప్రధానంగా... ఇంకా అమలు కాని చట్టానికి మీరు బాధితుడు ఎలా అనే కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి!!

Tags:    

Similar News