• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒక్క గెలుపుతో స్టార్...

ఒక్క గెలుపుతో స్టార్ ఇమేజ్.. లతారెడ్డి విక్టరీ స్పెషల్!

| రాష్ట్ర రాజకీయాల్లో ఎందరో నేతలు. వారిలో హేమాహేమీలు. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వరుసగా నాలుగైదు ఎన్నికల్లో గెలిచిన వారు ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2025-08-14 21:30 GMT

రాష్ట్ర రాజకీయాల్లో ఎందరో నేతలు. వారిలో హేమాహేమీలు. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వరుసగా నాలుగైదు ఎన్నికల్లో గెలిచిన వారు ఉన్నారు. కానీ, వారెవరికీ లేని గుర్తింపు, ప్రచారం ఒక్క రోజులో ఒక్క విజయంతో తెచ్చుకున్నారు పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి. జడ్పీటీసీ ఉప ఎన్నిక వరకు ఆమె పేరు రాష్ట్రంలో పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమె భర్త బీటెక్ రవి పలుమార్లు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో కూడా లతారెడ్డి పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ, పులివెందుల జడ్పీటీసీగా ఆమె సాధించిన అద్భుతమైన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా లతా రెడ్డి విజయం కోసమే చర్చించుకుంటున్నారు.

నిజానికి లతారెడ్డి విజయాన్ని వైసీపీ అసలు పరిగణించడం లేదని చెబుతోంది. కానీ, ఆ పార్టీలోనూ పరోక్షంగా లతారెడ్డి విజయంపై ప్రస్తావన వస్తోంది. దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన లతారెడ్డి తన ప్రత్యర్థిని కేవలం 600 ఓట్లకు కట్టడి చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత ఇలాకాలో మరీ ఇంత ఘోర ఓటమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి కారణమైన లతా రెడ్డి విజయం తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది.

టీడీపీ కూడా లతా రెడ్డి విజయం సాధిస్తారని అనుకున్నా, ఇంత భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఊహించలేదని ఆ పార్టీ హైకమాండ్ చెబుతోంది. పులివెందులలో ఆమె విజయ బావుటా ఎగరవేశారని తెలియగానే టీడీపీ పెద్దలు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా భువనేశ్వరి పులివెందుల ఫలితం వచ్చిన వెంటనే జడ్పీటీసీ లతా రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. లతా రెడ్డి విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించిన భువనేశ్వరి పులివెందుల విజయాన్ని బలంగా కోరుకున్నట్లు చెప్పారు. ఈ విజయం తనకు ఎంతో ఆనందం కలిగించిందని వ్యాఖ్యానించారు.

వైసీపీ పాలనలో తీవ్ర నిర్బంధం ఎదుర్కోవడమే కాకుండా, చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని ఆ కుటుంబం తీవ్రంగా తీసుకుందని భువనేశ్వరి ఫోన్ ద్వారా వెల్లడవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సహజంగా ఎన్నికల ఫలితాలపై భువనేశ్వరి స్పందించడం గతంలో ఎప్పుడూ చూడలేదని, కానీ, గత ఎన్నికల్లో నేరుగా ప్రచారానికి వెళ్లడమే కాకుండా పులివెందుల వంటి నియోజకవర్గాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారని తాజా ఘటన స్పష్టం చేస్తోందని అంటున్నారు. మరోవైపు ఒక్క విజయంతోనే టీడీపీ అధిష్టానం వద్ద లతారెడ్డి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారని అంటున్నారు. పులివెందులతోపాటు ఒంటిమిట్టలోనూ ఎన్నిక జరిగినా, అక్కడ గెలిచిన జడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి కోసం పెద్దగా చర్చ జరగడం లేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఎవరి నోట విన్నా లతా రెడ్డి విజయంపైనే విశేషంగా చర్చించుకోవడం కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    
  • LathaReddy 
  • Pulivendula 
  • TDP 
  • ZPTCVictory 
  • PoliticalUpset 
  • NaraChandrababu 
  • NaraLokesh 
  • NaraBhuvaneswari 
  • APPolitics 
  • లతా రెడ్డి 
  • పులివెందుల 
  • టీడీపీ 
  • వైసీపీ 
  • జడ్పీటీసీ 
  • నారా భువనేశ్వరి 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS