భీమవరం నుంచే పవన్... సంచలన ప్రకటన...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తెలిసిపోయింది. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారు అని ఒక స్పష్టత వచ్చింది

Update: 2024-03-12 13:33 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తెలిసిపోయింది. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారు అని ఒక స్పష్టత వచ్చింది. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు మంగళగిరిలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ ఎదురుగా ఉండగానే ఆయన సంచలన ప్రకటన చేశారు.

భీమవరం టికెట్ తనకు ఇస్తున్నారు అని తాను పోటీ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ భీమవరంలో పవన్ కళ్యాణే పోటీ చేస్తారు అని రామాంజనేయులు చెప్పేశారు. ఆయన ఆ ప్రకటన చేస్తున్నపుడు వేదిక మీద ఉన్న పవన్ చిరునవ్వుతో బదులిచ్చారు. అంటే పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లుగానే ఖాయం అయిపోయింది అని అంటున్నారు.

అంతే కాదు పవన్ కళ్యాణ్ ఆ తరువాత మాట్లాడుతూ తాను గత ఎన్నికల్లో భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను గతంలో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని ఆయన కామెంట్స్ చేశారు.

రాజకీయాలు అంటేనే యుద్ధం ఇక్కడ బంధుత్వాలు ఉండవని పవన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాను గత ఎన్నికల్లో పులివెందులలో పోటీ చేసి ఓడిపోయినా బాగుండేది అని పవన్ మరో కామెంట్ చేశారు. పులివెందుల అన్నది జగన్ సొంత సీటు. అక్కడ తాను పోటీ చేయాల్సింది అని పవన్ అనడం ఆశ్చర్యకరమే అంటున్నారు.

Read more!

ఇక తాను ఈసారి ఎన్నికల్లో పొత్తులకు వెళ్లడానికి ఒక కీలక వ్యక్తి కారణం అని పవన్ అన్నారు. ఆ కీలక వ్యక్తి పేరు మాత్రం ఆయన చెప్పలేదు. మరి ఎవరో అన్నది ఊహించుకోవడమే. ఏది ఏమైనా చూస్తే కనుక పవన్ పోటీ చేసే సీటు ఖరారు అయిపోయింది అని అంటున్నారు.

అయితే ఆయన నోటి వెంట మాత్రం ఆ సీటు విషయం చెప్పరని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా పవన్ పోటీ చేసే సీటు విషయం అధికారికంగా బయట పెట్టే చాన్స్ లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ భీమవరం పిఠాపురం తిరుపతి ఇలా అనేక అసెంబ్లీ సీట్లను పరిశీలించడం కూడా ఒక వ్యూహం అని అంటున్నారు.

పవన్ భీమవరంలో బలమైన నేత గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులుని జనసేనలోకి తీసుకోవడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. ఆయన మద్దతుతో ఈసారి కచ్చితంగా గెలవాలనే పవన్ ప్లాన్ చేశారు అని అంటున్నారు. పవన్ భీమవరంలో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అని అంటున్నారు. అధికార వైసీపీని కన్ఫ్యూజ్ చేయడానికే పవన్ ఇలా అనేక పేర్లు చెప్పారని అంటున్నారు.

మొత్తానికి పవన్ తనకంటూ ఒక బలమైన వర్గం క్యాడర్ ని రెడీ చేసి పెట్టుకుని మరీ భీమవరంలో పోటీకి దిగుతున్నారు అని తెలుస్తోంది. మరో వైపు చూస్తే టీడీపీతో బీజేపీ పొత్తు కుదర్చడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని రామాంజనేయులు ఆసక్తికరమైన కామెంట్స్ ఇదే కార్యక్రమంలో చేశారు. మోడీ ఒక్క పవన్ మాటనే వింటారు అని ఆయన చెప్పారు పవన్ కనుక ఒప్పించకపోతే టీడీపీని బీజేపీ దగ్గరకు కూడా రానీయదు అని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే తన ప్రాణం ఉన్నంతవరకూ జనసేనలో ఉంటాను అని రామాంజనేయులు మరో కీలక ప్రకటన చేశారు.

4
Tags:    

Similar News