కెనడా స్కూల్ కిల్లర్.. ఇంట్లో తల్లితో మొదలుపెట్టి.. షాకింగ్ అప్ డేట్స్!

ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం తాజాగా కాల్పులకు పాల్పడిన స్కూల్ నుంచి చదువు మానేసిందని చెబుతున్నారు.;

Update: 2026-02-12 08:30 GMT

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని స్కూల్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత 10 మంది మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు... 9 మంది మృతి చెందారని, 24 మంది గాయపడ్డారని కరెక్ట్ చేశారు! వీరిలో కాల్పులకు పాల్పడిన జెస్సీవాన్ రూట్ సెలార్ (18) అనే ట్రాన్స్ జెండర్ మహిళ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... కెనడాలో జరిగిన ఘోరమైన కాల్పుల ఘటన నిందితురాలు జెస్సీవాన్ రూట్ సెలార్.. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని గుర్తించబడింది. ఈ క్రమంలో తొలుత తన తల్లి (39), సవతి సోదరుడు (11)ని చంపిన అనంతరం జెస్సీవాన్.. గతంలో తాను చదువుకున్న స్కూల్ పై దాడి చేసిందని చెబుతున్నారు. 2,400 మంది జనాభా కలిగిన ఫసిఫిక్ ప్రావిన్స్ లోని ఈ మారుమూల కమ్యునిటీ అయిన టంబ్లర్ రిడ్జ్ లో కాల్పుల అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది.

వాస్తవానికి జెస్సీ పురుషిడిగానే జన్మించినప్పటికీ.. లింగమార్పిడి ద్వారా మహిళగా మారారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం తాజాగా కాల్పులకు పాల్పడిన స్కూల్ నుంచి చదువు మానేసిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీస్ కమాండర్ డ్వేన్ మెక్ డొనాల్డ్... ఆమెను ఒకటి రెండు సార్లు మానసిక ఆరోగ్య చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జెస్సీకి తుపాకీ లైసెన్స్ ఉందని.. అది గత ఏడాదే గడువు ముగిసిపోయిందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్కూల్ లో మరణించినవారిని అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... నిందితురాలు జెస్సీ, ఆమె తల్లి, ఆమె సవతి సోదరుడితో పాటు... ముగ్గురు 12 ఏళ్ల వయసున్న బాలికలు.. 12, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురితో పాటు, 39 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఓ బాలుడు మెట్లదగ్గర పడి ఉండగా.. మిగిలినవారు లైబ్రరీలో కనుగొనబడ్డారని మెక్ డొనాల్డ్ తెలిపారు.

ఈ సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్పదించారు. ఈ సందర్భంగా... టంబ్లర్ రిడ్జ్ లోని తల్లితండ్రులు, తాతమామలు, సోదరులు, సోదరీమణులు తాము ప్రేమించే వ్యక్తి లేకుండానే మరుసటి రోజు మేల్కొంటారు.. దేశం మీతో పాటు దుఃఖిస్తోంది, కెనడా మీకు అండగా ఉంటుంది అని భావోద్వేగంతో అన్నారు. ఇదే సమయంలో.. వారం రోజుల పాటు కెనడాలో ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేస్తామని తెలిపారు.

Tags:    

Similar News