• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ ...

ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ ఎలక్షన్... తెరపైకి ఆసక్తికర ఫలితం!

| ఈ సమయంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆసక్తికర ఫలితాలు దక్కాయి.

By - Tupaki Desk
Update: 2024-11-23 10:42 GMT

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రశాంత్ కిశోర్ పేరు సుపరిచితమే. రాజకీయ వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు! ఈ క్రమంలో జన సురాజ్ ఉద్యమాన్ని స్థాపించి.. అనంతరం దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. ఈ సమయంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆసక్తికర ఫలితాలు దక్కాయి.

అవును... రాజకీయ వ్యూహకర్తగా పరిచయం ఉన్న ప్రశాంత్ కిశోర్ గత నెల మొదట్లో బీహార్ లో జరిగిన బహిరంగ సభలో "జన్ సురాజ్ పార్టీ" ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు.

ఈలోపు ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ పోటీకి తన అభ్యర్థులను నిలబెట్టారు. ఇందులో భాగంగా... తరారీ, రాంగఢ్, బేలాగంజ్, ఇమాంగంజ్ నియోజకవర్గాల్లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే అనూహ్యంగా నాలుగు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ మూడు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులు.. ఒక స్థానంలో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. వీటిలో ఒకటి మినహా మిగిలిన మూడు స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. దీంతో... రాష్ట్రంలో రాజకీయ రంగంలో తుఫాను సృష్టిస్తారనే వాదనలు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని అంటున్నారు!

ఇక ఈ నాలుగు స్థానాల్లోనూ రెండు (తరారీ, రాంగఢ్) బీజేపీ, ఒకటి (బేలాగంజ్) జేడీయూ, ఒకటి (ఇమాంగంజ్) హెచ్.ఎం.ఏ.(ఎస్)లు గెలుచుకున్నాయి.

Tags:    
  • JanSurajMovement 
  • Jansurajparty 
  • Elections 
  • PrashantKishor 
  • Bihar 
  • Tarari 
  • Ramgarh 
  • Belaganj 
  • Imanganj 
  • Electionresult 

Similar News

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

Copyright @2026

Powered by Blink CMS